Rules Ranjan On OTT : ఈమధ్య కాలంలో, ఏ సినిమా హిట్ అవుతుంది అనేది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ తో వస్తున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పుడప్పుడు బోల్తా కొట్టేస్తున్నాయి. చిన్న సినిమాలు దూసుకు వెళ్ళిపోతున్నాయి. హిట్స్, ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా, కిరణ ఆబ్బవరం వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ, హీరోగా నటించి ఆకట్టుకుంటున్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో, సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు.
కిరణ్ అబ్బవరం మరోసారి, రూల్స్ రంజన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. అక్టోబర్ 6 న సినిమా రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం సరసన ఈ సినిమాలో డీజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మూవీ పై విడుదల కి ముందే, మంచి హైప్ వచ్చింది. కానీ, రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
రత్నం కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా, ఓటీటీలోకి రావడానికి కూడా రెడీ అయిపోయింది. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. మంచి రేటుకి ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుందట. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇంచుమించు నెలన్నర వరకు థియేటర్లోకి వచ్చిన సినిమా ఓటీటీ లోకి రాదు.
ఈ సినిమా నవంబర్లో కాకుండా అక్టోబర్ మూడో వారంలోనే, ఓటిటిలోకి వచ్చేస్తుందని టాక్ వినబడుతోంది. మరి ఎప్పుడు వస్తుందనేది చూడాలి. ఈ సినిమాలో నటించిన కిరణ్ ఆబ్బవరం, నేహా శెట్టి కి బాగా ప్రశంసలు వస్తున్నాయి. మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవాహర్ష ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనబడి ఆకట్టుకున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…