వినోదం

రిషబ్ శెట్టి రేంజ్ మామూలుగా లేదుగా..! ఒక్క సినిమాకు రూ.80 కోట్లు డిమాండ్..?

పారితోషికం భారీగా పెంచేసిన ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి. Photo Credit: Rishab Shetty/X.

కాంతారా సినిమా ముందు వ‌ర‌కు అస‌లు రిష‌బ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడు, నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆయన ప్రస్థానం ప్రధానంగా కన్నడ ప్రేక్షకులకే పరిమితమైంది. అయితే 2022లో వచ్చిన కాంతారాతో ఒక్కసారిగా ఆయన జీవితమే మారిపోయింది. కన్నడలో రెండు వారాల పాటు సంచలనం సృష్టించిన కాంతారా, ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ అయి విడుదలై అన్ని చోట్ల అద్భుత స్పందనను అందుకుంది. ఈ విజయంతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది కాంతారా చాప్టర్ 1. గత ఏడాది దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి భాగాన్ని మించిన విజయాన్ని సాధించింది.

తెలుగులో భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఓకే..?

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కాంతారా చాప్ట‌ర్ 1 సుమారుగా రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టిందని సమాచారం. దీంతో రిషబ్ శెట్టి మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా ఉత్తర భారతంలోనూ ఆయనకు వచ్చిన ఆదరణ, దక్షిణాది నటుడికి అరుదైన ఘనతగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. తెలుగులో జై హనుమాన్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా కమిట్ అయినట్టు సమాచారం. అంతేకాదు, ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఓ హిందీ చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

భారీ పారితోషికం అడుగుతున్నారా..?

అయితే రిషబ్ శెట్టి పారితోషికంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 ఘనవిజయం తర్వాత ఆయన ఒక్కో సినిమాకు సుమారుగా రూ.80 కోట్ల పారితోషికం కోరుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తన మార్కెట్ స్థాయికి తగ్గట్టుగానే పారితోషికం ఉండాలని, ఇకపై ఎలాంటి రాజీ పడబోనని ఆయన భావిస్తున్నారని ఇండ‌స్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి లైనప్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులు అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లగానే భారీ బజ్ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక, ఆయన మళ్లీ కాంతారా ఫ్రాంచైజీకి తిరిగి వచ్చి మరో కొత్త భాగాన్ని తెరకెక్కించే అవకాశమూ ఉందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM