RGV On Animal Movie : బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న వారిలో రణ్‌బీర్ కపూర్ ఒకరు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో మంచి చిత్రాలు చేశారు. రీసెంట్‌గా యానిమల్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. రెండో వారంలోనూ ఇది జోరును కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన ‘యానిమల్’ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. చిత్రంలో రణ్‌బీర్‌ను అద్భుతంగా చూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు దేశమంతా కూడా రణ్‌బీర్‌ను కీర్తిస్తోంది. నటనలో అద్భుతం అని పొగిడేస్తోంది.
అయితే ఈ చిత్రంని తెలుగు హీరోతో చేస్తే బాగుండేదని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు సందీప్ వంగా కాంబోలో డెవిల్ అనే సినిమా రావాల్సి ఉండగా, మహేష్ బాబుకి సైతం కథ బాగానే నచ్చిన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సందీప్ వంగా బాలీవుడ్‌కు చెక్కేశాడు. మహేష్‌కి చెప్పిన కథనే ఈ యానిమల్ అని చాలా మందిలో సందేహం ఉంది. దానిపై క్లారిటీ ఇచ్చిన సందీప్.. మహేష్ బాబుకు చెప్పిన కథ ఇది కాదని, అది ఇంకా వయలెంట్‌గా ఉంటుందని సందీప్ వంగా క్లారిటీ ఇచ్చాడు. కానీ యానిమల్ సినిమాలో తెలుగు ఆడియెన్స్ మాత్రం విజయ్ దేవరకొండని ఊహించుకుంటున్నారు. ఒక వేళ యానిమల్ చేసి ఉంటే తెలుగులో ఇంకో రేంజ్‌లో ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. చిత్రంలో రణ్‍బీర్ కపూర్ నటన అద్భుతమని అన్నాడు. ఆయన కాకుండా మరే హీరో ఆ పాత్రకి సెట్ అవుతాడని వర్మని ప్రశ్నించగా, రణ్‍బీర్ కాకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే ఆ పాత్రకు సూటయ్యే వాడని రామ్ గోపాల్ వర్మ అన్నారు. నా అభిప్రాయం ప్రకారం రణ్‍బీర్ తప్ప మరెవరూ ఆ పాత్రను అలా చేయలేరు. రణ్‍బీర్ కాకుండా అంటే విజయ్ దేవరకొండ చేసి ఉండేవాడు. వీరిద్దరూ తప్ప మిగిలిన వారు ఈ క్యారెక్టర్ చేయడం కష్టం అంటూ వర్మ తనశైలిలో బదులిచ్చాడు. సినిమా అంటే ఇలా ఉండాలని సందీప్ రెడ్డి యానిమల్‌తో నిరూపించాడు. చిత్రంలో హింస, బోల్డ్ సీన్లు హద్దులు దాటాయని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. సినిమాను సినిమాలాగే చూడాలని చెప్పుకొచ్చారు. యానిమల్ కథ కంటే సందీప్ రెడ్డి వంగా దాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం అని ఆయన కామెంట్ చేశారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…