Rashmi Gautam : జబర్ధస్త్ షోతో పుల్ పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.హీరోయిన్ కావాలని తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. క్రేజ్ కొట్టేసింది. ఇక హీరోయిన్ ఫ్రెండుగా… పలు సినిమాల్లో నటించి అలరించింది. అయితే అంతగా ఛాన్సులు రష్మీని పలకరించకపోవడంతో… మళ్లీ యాంకరింగ్ వైపు మళ్లింది. అలా బుల్లితెరపై అప్పటికే జనాలను ఎంటర్ టైన్ చేస్తున్న జబర్దస్త్ షోలో అనసూయకు పోటీగా దిగింది. ఇక అక్కడి నుంచి రష్మి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి.
ఇప్పుడు జబర్ధస్త్‌తో పాటు పలు షోస్‌తో తెగ సందడి చేస్తుంది రష్మీ.హాట్ హాట్ అందాలతో అదరగొట్టడం వలన మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ సుడిగాలి సుధీర్ తో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నడిపింది. ఇది ఫుల్ గా వర్క్ అవుట్ అవ్వడంతో మరితం పాపులర్ అయింది. వీరిద్దరి డాన్సులు, పెళ్లి స్కిట్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. సుధీర్-రష్మీ నిజ జీవితంలో కూడా లవర్స్ అని జనాలు గట్టిగా నమ్మేంతగా వారి లవ్ ట్రాక్ నడిచింది. వారు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారాలు సాగాయి. కాని ప్రతిసారి వాటిని రష్మీ, సుధీర్ ఖండిస్తూనే వచ్చారు. ఇక రష్మీ పెళ్లి వార్తలు నిత్యం నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటాయి.
ఆ మధ్య ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం చెప్పుకున్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని అన్నారు. కాని అది పుకారుగానే మిగిలిపోయింది. ఇక రష్మీ పెళ్లి గురించి పదే పదే ప్రశ్నలు వెల్లువెత్తుండగా, ఈ సారి పక్కా క్లారిటీ ఇవ్వనుందట. తాజాగా “రష్మీ పెళ్లి పార్టీ” పేరుతో ఒక ఈవెంట్ చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్ లో రష్మి తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుందని, తనకి కాబోయే భర్తకు సంబంధించిన విషయం ఈ షోలో బయట పెట్టబోతున్నట్టు అర్ధమవుతుంది. అయితే నిజంగానే రష్మీ తనకి కాబోయే వ్యక్తి గురించి చెబుతుందా, లేకుంటే షో హైప్ కోసం ఇలా ట్విస్ట్ ఇచ్చారా అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…