వినోదం

మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!

బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు విడుదల తేదీలను మార్చుకున్న టాలీవుడ్ హీరోలు. Photo Credit: Mythri Movie Makers / Zee Studios / Dacoit Team.

మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ సినిమా ఆక్రమించింది. కొన్ని నెలల క్రితం వరకు రామ్ చరణ్, అడివి శేష్ తమ సినిమాలు పెద్ది, డెకాయిట్ ల‌తో భారీ పోటీలో ఉన్నప్పటికీ మార్చిలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప‌వన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ వేసవిలో బాక్సాఫీస్ మంటలు రేపుతుంది. పవర్ స్టార్ – కల్ట్ కెప్టెన్ కాంబినేషన్‌తో ఉస్తాద్ గ్రాండ్ రిలీజ్ అంటూ వారు ప్రకటన చేశారు.

కొత్త తేదీలు ఇవే..

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే బుచ్చి బాబు సానా సోషల్ మీడియాలో 30-04-2026 న PEDDI వ‌స్తుంది అంటూ పోస్టు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కూడా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ PEDDI ఏప్రిల్ 30, 2026న మీ ముందుకు వస్తుంద‌ని తెలిపారు. మొదట మార్చి 27కు నిర్ణయించిన విడుదలను అధికారికంగా ఏప్రిల్‌కు మార్చేశారు. ఇక అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ ను కూడా మార్చి 19 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. దీంతో మార్చి 26న నాని నటించిన ది ప్యారడైజ్ విడుదల యథావిధిగా జరుగుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ మూవీలే కార‌ణ‌మా..?

ఇక మార్చి నెలలో ప్రధానంగా మిగిలింది ఒక్కటే భారీ పోరు. ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ తొలి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దానికి సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు యశ్ నటించిన టాక్సిక్ సినిమా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపైనా భారీ హైప్ ఉంది. ఇక మార్చి బాక్సాఫీస్ రంగం ఇప్పుడు ప‌వన్ కళ్యాణ్ సినిమాతో మరింత హీట్ పెరిగింది. ఏప్రిల్‌లో మాత్రం టాలీవుడ్ స్టార్ సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉండడంతో రాబోయే నెలలు సినిమా ప్రేమికులకు పండగే అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM