Rajinikanth Net Worth : తన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు రజనీకాంత్. సౌత్ సినిమా ఇండస్ట్రీ ఆరాధ్య దైవంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగాను అశేష ప్రేక్షకాదరణ పొందారు. . ఎక్కడికి వెళ్లినా తలైవాకు అభిమానులు నీరాజనం పలుకుతారు. బస్ కండక్టర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత సూపర్ స్టార్ ను చేసింది. ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. దీంతో రజనీకాంత్ కు జైలర్ సినిమా కి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..రజనీకాంత్ ఎంతో మంది నిర్మాతలకు సినిమాలు ఫ్లాప్ అయితే డబ్బులను కూడా తిరిగి ఇచ్చేవారట.అయినప్పటికీ కొన్ని వందల కోట్ల ఆస్తిని సైతం సంపాదించారు.
రజినీకాంత్ ఆస్తి విలువ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. అతనికి 445 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. చెన్నైలో పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఒక ఇల్లు ఉన్నదట. దీన్ని 2002లో రజనీకాంత్ చాలా ఇష్టంగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ వద్ద రెండు రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయట. రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయని.. అవే కాకుండా టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన వాహనాల్లో రూ. 1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం
రజినీ కాంత్ కు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉండగా.. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని సమాచారం. బస్ కండక్టర్ నుంచి.. సినిమాలపై ఇంట్రెస్టుపై సినీ రంగంలోకి అడుగుపెట్టిన తలైవా.. అనేక దశాబ్దాలుగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నాడు. అతని స్టైలంటే ప్రజలను ఎంతో ఇష్టం. 1975లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రజినీ.. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలు తెలుగు,తమిళ్, హిందీ పరిశ్రమలో తనదైన ముద్ర చాటుకున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…