Radhe Shyam : సాహో తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. రాధేశ్యామ్ నుంచి లవ్ ఆంథమ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. మొదట హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
ఆషికీ ఆ గయీ.. అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ప్రభాస్-పూజాల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఉంది. మనసుని హత్తుకునేలా సాగిన ఈ ప్రేమగీతాన్ని అర్జీత్ సింగ్ ఆలపించారు. రాధేశ్యామ్ హిందీ వెర్షన్‌కు మిథున్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి మృతి చెందిన కారణంగా నగుమోము పాటను వాయిదా వేయగా తాజాగా విడుదల చేశారు.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ పాట శ్రోతలను ఎంతగానో అలరిస్తోంది. జస్ట్ మ్యూజిక్‌తో సాగే ఈ సాంగ్ సినిమాపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచింది. విజువల్స్ మరింత కనువిందుగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్, పూజాహెగ్డే క్యూట్‌గా, అందంగా కనిపిస్తున్నారు. ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా ఆయన లుక్ ఉండటం విశేషం. లవర్ బాయ్‌లా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…