గురువారం, జూన్ 11, 2026
వినోదం

Prakash Raj : త‌న అసిస్టెంట్స్‌కి ప్ర‌కాశ్ రాజ్ డూప్లెక్స్‌లు క‌ట్టించి ఇచ్చాడా..!

Prakash Raj : విల‌క్ష‌ణ నటుడిగా సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌కాశ్ రాజ్. సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. భయంకరమైన్ విలన్ గా.. ఓ మంచి తండ్రిగా..…

Prakash Raj : త‌న అసిస్టెంట్స్‌కి ప్ర‌కాశ్ రాజ్ డూప్లెక్స్‌లు క‌ట్టించి ఇచ్చాడా..!

Prakash Raj : విల‌క్ష‌ణ నటుడిగా సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌కాశ్ రాజ్. సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. భయంకరమైన్ విలన్ గా.. ఓ మంచి తండ్రిగా.. అన్నగా.. స్నేహితుడిగా.. తాతగా ఇలా అనేక పాత్ర‌ల‌లో ప్రకాశ్ రాజ్ త‌న న‌ట విన్యాసం చూపించారు.

Prakash Raj given duplex houses to his assistants

వెండితెరపై నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణ భారత సినీ ప్రపంచంలో విల‌క్ష‌ణ న‌టుడిగా ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌ల మా ఎల‌క్ష‌న్స్‌లో ఓడిపోయారు. అయితే ఎల‌క్ష‌న్స్ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్‌పై కొంద‌రు అవాకులు చెవాకులు పేల్చారు. ప్రకాష్ రాజ్ జూనియర్ ఆర్టిస్ట్‌లను సరిగా చూడడని., ఎవరినీ కలుపుకునిపోయే.. మాట్లాడే స్వభావం ఆయనకు లేదంటూ ప్రకాష్ రాజ్‌ని చాలామంది విమర్శించారు.

తాజాగా ప్ర‌ముఖ న‌టుడు ఆనంద్ భార‌తి.. ప్ర‌కాశ్ రాజ్ గొప్పత‌నాన్ని తెలియ‌జేస్తూ.. కొన్ని కామెంట్స్ చేశారు. బద్రి సినిమాలో మెయిన్ విలన్‌గా ప్రకాష్ రాజ్ వస్తే.. ఈ మాత్రం మేం చేయలేం అనుకున్నాం.. కానీ రాను రాను తెలిసింది ఏంటంటే.. నిజంగా ఆ పాత్ర మాకు ఇస్తే మేం చేయలేం.. క్యారెక్టర్‌కి ప్రాణం పోస్తాడు ఆయన.. మనం చేస్తూ చేస్తూ పోతే ఏనాడైనా ప్రకాష్ రాజ్‌లా మనం చేయవచ్చు.

ప్ర‌కాశ్ రాజ్ ద‌గ్గ‌ర మేం ఏం రోజు సాయం తీసుకోలేదు, కాని ఆయ‌న వాళ్ల అసిస్టెంట్స్‌కి మణికొండలో డూప్లెక్స్ హౌస్‌లు కట్టిచ్చారు. ఈ రోజుల్లో అలాంటి సాయం ఎవరు చేస్తారు.. అది ఆయన గొప్పతనం’ అంటూ ప్రశంసలు కురిపించారు ఆనంద్ భార‌తి. ఎక్స్ ప్రెస్ రాజా, గోలీమార్, దుబాయ్ శ్రీను, అతడు, నువ్వు నాకు నచ్చావ్, కిక్, బద్రి తదితర చిత్రాల్లో ఆనంద్ న‌టించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి