Pooja Hegde : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈమె నుంచి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా అభిమానులకు నిరాశే మిగులుతోంది.. గత సంవత్సరం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలో నటించిన అది ఫ్లాప్ అయింది. చిరంజీవి ఆచార్య చిత్రం కూడా పూజాకి కలిసి రాలేదు. ముఖ్యంగా బాలీవుడ్ మీద మోజుతో అక్కడ అవకాశాల కోసం వెళ్లిన స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిన ఫ్లాపులు గానే మిగిలాయి.
టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు అన్నిటిని కూడా వదులుకొని ఇప్పుడు సైలెంట్ గా ఉంటోంది పూజా హెగ్డే .గతంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆ సినిమా ఆగిపోయింది. గుంటూరు కారం ఒప్పుకున్నాక తప్పిపోవడం ఫ్యాన్స్ ని ఇప్పటికీ బాధ పెడుతోంది. అది కాస్తా శ్రీలీలని వరించడం ఇంకాస్త పెంచింది. దీని సంగతలా ఉంచితే త్వరలో ఈ డీజే భామ డిజిటల్ డెబ్యూ చేయబోతోందనే టాక్ వినిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓటిటి వర్గాల టాక్. కోలీవుడ్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ సిద్ధమయ్యిందని వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విక్రమ్ కోబ్రా, నయనతార ఇమైక్క నొడిగళ్ చిత్రాలని అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. హారర్ జానర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన డిమాంటీ కాలనీతో డెబ్యూ చేశాడు. ఇప్పుడు దీని సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పూజా హెగ్డే చుట్టే కథ రాసుకున్నాడట. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకే పరిమితమైన పూజాకు ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కడం మంచిదే. తనలో ఉన్న అసలైన నటిని బయటికి తీసుకొచ్చే అవకాశం వెబ్ వరల్డ్ లోనే ఉంటుంది. బోల్డ్‌గా ఈ అమ్మడు ప్రేక్షకులని చాలా అలరిస్తుందని అంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…