గురువారం, జూన్ 11, 2026
వినోదం

Pawan Kalyan: ప‌వ‌న్ అంటే మ‌రీ ఇంత పిచ్చా.. పెళ్లి కార్డ్‌పై ఫోటో ప్రింట్ చేయించుకున్న అభిమాని

Pawan Kalyan : పవర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఆయ‌న‌పై అభిమానాన్ని ర‌క‌రకాలుగా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఆ మ‌ధ్య పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని…

Pawan Kalyan: ప‌వ‌న్ అంటే మ‌రీ ఇంత పిచ్చా.. పెళ్లి కార్డ్‌పై ఫోటో ప్రింట్ చేయించుకున్న అభిమాని

Pawan Kalyan : పవర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఆయ‌న‌పై అభిమానాన్ని ర‌క‌రకాలుగా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఆ మ‌ధ్య పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన ఆ యువకుడు పెళ్లి సమయంలో.. జనసేనానిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడంటున్న ఈ యువకుడు.. శుభలేఖపై దేవుడి ఫొటో ఉండాల్సిన చోట పవన్ ఫొటోను ముద్రించాడు.

Pawan Kalyan fan printed his photo on his wedding card

త‌న పెళ్లికి హజరై ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్‌కు ఇన్విటేషన్ సైతం పంపాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. జనసేనాని జన్మదినం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ తన అభిమాన నాయకుడికి వినూత్న రీతిలో విషెస్ చెప్పాడు. రూబిక్ క్యూబ్ ఆర్టిస్ట్ అయిన శ్రీచరణ్.. 550 రూబీ క్యూబ్‌లతో నవ్వుతున్న పవన్ కల్యాణ్ రూపాన్ని తీర్చిదిద్దాడు. రూబిక్‌లను ఇలా సెట్ చేయడానికి రెండు రోజులు కష్టపడ్డానని చరణ్ తెలిపాడు.

ఇలా అభిమానులు ప‌లు సంద‌ర్భాల‌లో ప‌వ‌న్‌పై అభిమానం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండ‌లం కేశ‌వ‌రావు పేట గ్రామానికి చెందిన త‌మ్మినేని శ్రీనివాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ డిసెంబ‌ర్ 18న ఆయ‌న పెళ్లి కుదిరింది. త‌న జీవితంలో జ‌ర‌గుతున్న శుభకార్యంలో ఈ అభిమాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు. ఆయ‌న పెళ్లి కార్డ్ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి