Parking OTT : తమిళనాట హిట్ అయిన చాలా చిత్రాలు తెలుగులోకి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు హరీష్ కళ్యాణ్ అలాగే సీనియర్ నటుడు ఎం ఎస్ భాస్కర్ లు నటించిన చిత్రం “పార్కింగ్” కూడా ఒకటి. దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు జెనరేషన్ ల మధ్య ఈగో నేపథ్యంలో వచ్చింది. మరి తమిళ నాట చాలా పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా మూవీ లవర్స్‌కి గట్టిగానే వినిపించింది.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.
అద్దె కారు యజమాని వారి జీవితంలో ఎదుర్కొనే వాస్తవిక సమస్యల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటుడు ఎంఎస్ భాస్కర్ హరీష్ కళ్యాణ్ తరహా పాత్రలో నటించారు. హరీష్ కళ్యాణ్ సరసన ఇందుజ కూడా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల లోపే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో చూడని ఈ కామెడీ డ్రామాను ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.ఈ సినిమా నేటి నుంచి తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చేసింది. మరి తెలుగులో కూడా చూడాలి అనుకునేవారు ఈ సినిమాని ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా సుధన్ సుందరం నిర్మాణం వహించారు.
చిత్ర కథ విషయానికి వస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే, హీరో ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య తలెత్తడంతో… ఇంటి ఓనర్‌కు, హీరోకు మధ్య పెద్ద వాగ్వాదమే కాకుండా కొట్టుకునే వరకు వెళతారు. ఆ తర్వాత అది పోలీసుల కేసు వరకు వెళ్తుంది. చివరికీ ఈ పార్కింగ్ సమస్యను ఎలా పరిష్కరించారనేదే మూవీ కథ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…