Samantha : స‌మంత నీకు అన్నీ క‌రెక్ట్, మ‌హేష్‌కి మాత్రం త‌ప్పా.. సామ్‌ని ఆడుకుంటున్న నెటిజ‌న్స్

December 17, 2021 10:41 AM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత వ‌రుస వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతోంది. చైతూ నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత ఆమెని తెగ ట్రోల్ చేశారు. ఇక రీసెంట్‌గా సమంత నటించిన ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటలోని సాహిత్యం మగవాళ్లందరూ కామంతో ఉంటారనే అర్థం వచ్చేలా ఉండ‌డంతో కేసు న‌మోదు చేశారు.

Samantha trolled by mahesh babu fans

పుష్ప చిత్రం నుండి ఆ పాటను తీసేయాలంటూ పురుష సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే పాట‌ని ప‌ట్టుకొని మ‌హేష్ ఫ్యాన్స్ ఆమెపై మండిప‌డుతున్నారు. పాట‌లో స‌మంత ఓ వ్య‌క్తి గుండెల‌పై కాలి పెట్టి స్టెప్పులేసింది. ఇప్పుడు స‌మంత‌కు అక్క‌డే కొత్త త‌లనొప్పి వ‌చ్చింది. మ‌హేష్ ఫ్యాన్స్ దీన్ని ప‌ట్టుకొని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. సామ్‌ని మహేష్ అభిమానులు ఇలా ట్రోల్ చేయ‌డం వెన‌క గ‌ట్టి కార‌ణ‌మే ఉంది.

2014లో మ‌హేష్ న‌టించిన నేనొక్క‌డినే సినిమాలో ఓ సాంగ్‌లో హీరోయిన్ కృతిస‌న‌న్‌.. మ‌హేష్ కాళ్ల‌ను ఫాలో అవుతున్న‌ట్లు ఓ సీన్ ఉంటుంది. దానిపై అప్ప‌ట్లో స‌మంత చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపాయి. అప్ప‌ట్లోనే స‌మంత‌పై మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొర‌క‌డంతో మ‌రింత ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చేస్తే క‌రెక్ట్ , మ‌హేష్ చేస్తే త‌ప్పా.. అంటూ మండిప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now