వినోదం

Mahesh Babu T Shirt Price : మ‌హేష్ బాబు ధ‌రించిన ఈ టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా.. షాక‌వుతారు..!

Mahesh Babu T Shirt Price : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ కూడా ఇటీవలి కాలంలో మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి. ప్ర‌స్తుతం గుంటూరు కారం అనే చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న మ‌హేష్ బాబు త్వ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. అయితే రాజ‌మౌళి సినిమా త‌ర్వాత మ‌హేష్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు చాలా త‌క్కువ‌గా బ‌య‌ట క‌నిపిస్తుంటారు. ఆయ‌న రీసెంట్‌గా యానిమ‌ల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క‌నిపించి సంద‌డి చేశారు. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ భారీ ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ఎంతో సింపుల్ గా లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జిన్స్ తో వచ్చారు. తాజాగా మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర నెట్టింట వైరల్ అవుతుంది. ఒక ప్లెయిన్ టీషర్ట్ , జీన్స్ వేసుకొని వచ్చి అందరిని డామినేట్ చేశాడు మహేష్ బాబు. అయితే మహేష్ వేసుకున్న టీషర్ట్ సింపుల్ గానే ఉంది కానీ దాని ధర మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో ఉంది. గివేంచి బ్రాండ్ కు చెందిన ఈ టీషర్ట్ చాలా కాస్ట్ గురూ.. దీని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టీషర్ట్ ధర అక్షరాలా రూ. 47వేలు. చూడటానికి సింపుల్ గా ఉంది కానీ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Mahesh Babu T Shirt Price

మ‌హేష్ బాబు టీష‌ర్ట్ ధ‌ర విన్న త‌ర్వాత అంద‌రు కూడా ..మరి సూపర్ స్టార్ మహేష్ బాబా? మజాకా అంటూ అభిమానులు అంటున్నారు. సాధార‌ణంగా ఎక్కువ మంది సెల‌బ్స్ స్పెషల్ గా డిజనర్ సెట్ చేసిన డ్రెస్సులు, చీరలు ధరించి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం దీనికి పూర్తి విరుద్దం. మూవీ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్స్ కి చాలా సింపుల్ గా వెళ్తుంటారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చాలా ట్రెండీగా కనిపిస్తారని అభిమానులు అంటుంటారు. యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి కూడా అలానే వ‌చ్చిన ఆయ‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM