గురువారం, జూన్ 11, 2026
వినోదం

Mahesh Babu: ఆప‌రేష‌న్ చేయించుకున్న మ‌హేష్ బాబు.. దుబాయ్‌లో విశ్రాంతి

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ బాబు స‌ర్జ‌రీ చేయించుకోనున్న‌ట్టు వార్త‌లు రాగా, అది నిజ‌మ‌ని తెలుస్తుంది. స్పెయిన్‌లో మహేష్‌…

Mahesh Babu: ఆప‌రేష‌న్ చేయించుకున్న మ‌హేష్ బాబు.. దుబాయ్‌లో విశ్రాంతి

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ బాబు స‌ర్జ‌రీ చేయించుకోనున్న‌ట్టు వార్త‌లు రాగా, అది నిజ‌మ‌ని తెలుస్తుంది. స్పెయిన్‌లో మహేష్‌ బాబు మోకాలికి వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం మహేష్‌ బాబుకి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

surgery to Mahesh Babu knee resting in dubai

కోలుకున్నాక ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్‌లో మహేష్‌ బాబు పాల్గొననున్నాడు. దుబాయ్‌లో మహేష్‌ బాబుతో పాటు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్‌ బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందన్న విషయం తెలిసిన అభిమానులు ఆయన ఆరోగ్యంపై కొంత ఆందోళన చెందారు. దాదాపు రెండు నెలల పాటు మహేశ్‌బాబు షూటింగ్‌కి దూరంగా ఉండనున్న నేప‌థ్యంలో సర్కారు వారి పాట రిలీజ్‌పై అనుమానాలు ఏర్ప‌డ్డాయి.

మహేశ్‌బాబు గతంలో కూడా మోకాలి నొప్పితో గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్‌కి వెళ్లారు. అప్పుడు సర్జరీ చేయించుకోకపోవడం వల్లే ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు నొప్పి మ‌రింత ఎక్కువ కావ‌డంతో త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల‌లో స‌ర్జరీ చేయించుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి