వినోదం

మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ట్రోలర్‌కు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్!

సోషల్ మీడియాలో మెగాస్టార్‌పై వచ్చిన వ్యాఖ్యలపై స్పందించిన లావణ్య. Photo Credit: Lavanya Tripathi/Instagram/Chiranjeevi/X.

మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజ‌న్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్ తేజ్ పెద‌నాన్న చిరంజీవి కావ‌డంతో ఆయ‌న‌పై ఓ వ్య‌క్తి వేసిన జోక్‌ను ఆమె ఖండించారు. ముఖ్యంగా మనవడి విషయంలో చిరంజీవికి ప్రత్యేక అభిరుచి ఉందంటూ చేసిన వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లావణ్య.. సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ ఇది మీ నుంచి రావడం ఆశ్చర్యం కలిగించింది. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబ సందర్భాన్ని అతి నీచంగా మలిచారు. ఆయన తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంత గౌరవంగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే పనుల్లో కనీసం ఒక శాతం కూడా చాలా మంది పురుషులు చేయలేరు. నిజంగా తెలియని వారి గురించి వ్యాఖ్యానించకపోవడమే మంచిది.. అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

లావ‌ణ్య కామెంట్ల‌పై మిశ్ర‌మ స్పంద‌న‌..

ఈ ట్వీట్ వైరల్ కావడంతో, లావణ్యకు మద్దతుగా పలువురు స్పందించగా, ఆమె మాటల తీరు సరైంది కాదంటూ కొందరు విమర్శించారు. ఇతరులను తక్కువ చేసి మీ కుటుంబాన్ని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఇది 2026, ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా ఫిబ్రవరి 2025లో ఓ కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన ఇంట్లో నలుగురు మనవరాళ్లు ఉండటంతో లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించిన చిరంజీవి, తన కుమారుడు రామ్ చరణ్ నుంచి మనవడు పుడితే కుటుంబ వారసత్వం కొనసాగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఇంకోసారి అమ్మాయి పుడితే ఏమవుతుందోనని భయంగా ఉంది.. అన్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్న చిరు వ్యాఖ్య‌లు..

రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు 2023లో కుమార్తె క్లిన్ కారా జన్మించగా, ఆమెతో పాటు చిరంజీవికి సుష్మిత కొణిదెల కుమార్తె సమరా, శ్రీజ కొణిదెల కుమార్తెలు నివ్రతి, నవిష్కా మనవరాళ్లుగా ఉన్నారు. కాగా లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ దంపతులకు గత ఏడాది కుమారుడు జన్మించగా, ఆ సందర్భంగా చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొణిదెల కుటుంబంలో పుట్టిన చిన్నారికి హృదయపూర్వక స్వాగతం. వరుణ్, లావణ్యకు అభినందనలు. బిడ్డకు ఆరోగ్యం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే చిరంజీవి అప్పుడ‌ప్పుడు చేస్తున్న వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి. ఈమ‌ధ్యే సినిమా ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని అన్నారు. కానీ ఆ వ్యాఖ్య‌ల‌కు సింగ‌ర్ చిన్మ‌యి స‌హా ప‌లువురు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గ‌తంలో చేసిన ఆ లింగ వివ‌క్ష వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నాయి. అయితే లావ‌ణ్య త్రిపాఠి అలా స్పందించం క‌రెక్టేనా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌జేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM