వినోదం

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!

హైద‌రాబాద్ శివార్ల‌లో ‘కల్కి 2’ షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర బృందం. Photo Credit: Vyjayanthi Movies/X.

క‌ల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న క‌ల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న శంక‌ర్‌ప‌ల్లిలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో క‌ల్కి 2 చిత్ర షూటింగ్‌ను మేక‌ర్స్ ప్రారంభించారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొద‌టి పార్ట్ లో ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న‌తోపాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల‌హాస‌న్‌, విజ‌య్ దేవ‌రకొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌, దీపికా ప‌దుకొనె, దిశా ప‌ఠాని వంటి అగ్ర న‌టీన‌టులు మొద‌టి పార్ట్‌లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. 2024లో విడుద‌లైన క‌ల్కి మొద‌టి పార్ట్ బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. త‌రువాత స‌రిగ్గా 20 నెల‌లకు ఇప్పుడు సెకండ‌ర్ పార్ట్ షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

కొన్ని రోజుల త‌రువాతే ప్ర‌భాస్‌..?

క‌ల్కి 2 చిత్రానికి సంబంధించి మొద‌టి షెడ్యూల్ షూటింగ్‌లో బాలీవుడ్ అగ్ర న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌తోపాటు త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల‌హాస‌న్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ అంత‌కు ముందు పోషించిన అశ్వ‌త్థామ రోల్‌లో మ‌ళ్లీ ఇప్పుడు కొన‌సాగ‌నుండ‌గా, క‌మ‌ల్ య‌థావిధిగా సుప్రీం యాస్కిన్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ఇక షెడ్యూల్‌లో కొన్ని రోజుల అనంత‌రం షూటింగ్‌లో ప్ర‌భాస్ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది.

దీపికా స్థానంలో ఎవ‌రు..?

క‌ల్కి 2 చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తుండ‌గా సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి భాగంలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనె సుమ‌తి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆమె సీక్వెల్‌లో న‌టించ‌డం లేద‌ని గతంలోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో ఆమె స్థానంలో చిత్ర యూనిట్ ఎవ‌రిని తీసుకుంటుంది అని ఇప్ప‌టికే అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఓ ద‌శ‌లో ఈ పాత్ర‌కు అనేక మంది పేర్లు వినిపించ‌గా, రీసెంట్‌గా వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం సుమ‌తి పాత్ర‌కు సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే దీనిపై మేక‌ర్స్ గోప్య‌త‌ను పాటిస్తూ చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ ఉంచి ఆ త‌రువాత దాన్ని సినిమా హైప్ కోసం వాడుతారా, లేక భ‌విష్య‌త్తులో ఈ పాత్ర చేయ‌బోయే న‌టి ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డిస్తారా.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM