Jyothsna Tirunagari : రామ్ గోపాల్ వర్మ సంచలనాలకి మారు పేరు.వర్మ పుట్టిన తర్వాత వివాదం పుట్టిందా అనేంత తన సినిమాలతో పాటు తన ఆటిట్యూట్‌తో ఎపుడు వార్తల్లో ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వర్మ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడును నెగిటివ్‌గా చూపిస్తూ వ్యూహం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సెన్సార్ కాకుండా లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా.. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసారు. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలను టార్గెట్ చేసిన ఈయన.. ఇపుడు మరోసారి వ్యూహం అనే సినిమాతో సంచలనం సృష్టించబోతున్నాడు.
నిజానికి నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ కమిటీ అభ్యంతరం చెప్పడంతో వాయిదా పడింది. తిరిగి బెంగళూరులోని రివైజ్ కమిటీ సిఫార్సు మేరకు డిసెంబర్ 29న థియేటర్లో విడుదల కానుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా చిత్ర దర్వకుడు వర్మపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నతిరునగరి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను అవమానిస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోత్స్న ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసి తన ఫిర్యాదు పత్రాన్ని జ్యోత్స్న అందజేశారు. వర్మ సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు కూడా పెడుతున్నారని కమిషనర్ దృష్టికి జ్యోత్స్న తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పిస్తామని కూడా చెప్పారు. నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని పేటీఎం బ్యాచ్‌ల మాదిరిగా మీరు కూడా తయారైతే ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు తెలంగాణ పోలీసుల మీద చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా రాంగోపాల్ వర్మ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారని మేం భావిస్తున్నాం అని జ్యోత్స్న అని అన్నారు.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…