Iraivan Review : సైకో కిల్లర్ కథాంశం తో జయం రవి, నయనతార కాంబినేషన్ లో ఇరైవన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది..?, ఈ సినిమా కథ ఏంటి..? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తమిళ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయింది. ఐ అహ్మద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ విలన్ గా నటించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఏసీపీ అర్జున్ (జయంరవి) స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. చాలా ధైర్యవంతుడు కూడా. క్రిమినల్ ని శిక్షించడానికి అవసరమైతే, చట్టాన్ని కూడా అతిక్రమించడంలో తప్పు లేదనుకునే స్వభావం కలవాడు.
సిటీ లోని చాలా మంది అమ్మాయిల్ని బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్ (రాహుల్ బోస్) హత్య చేస్తాడు. అర్జున్ అలానే అతడి స్నేహితుడు ఆండ్రూకి (నరేన్) అతన్ని పట్టుకోవాలని చూస్తారు. అయితే, ఈ బ్రహ్మను పట్టుకునే క్రమం లో ఆండ్రూ చనిపోతాడు. ఆండ్రూ కుటుంబ బాధ్యతల్ని అర్జున్ తీసుకుంటాడు. పోలీస్ ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాడు. ఆండ్రూ చెల్లెలు ప్రియతో (నయనతార) పాటు కాఫీ షాప్ ఓపెన్ చేస్తాడు.
జైలు నుంచి తప్పించుకున్న బ్రహ్మ కిడ్నపులు స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మను తెలివిగా పోలీసులే షూట్ చేసేటట్టు అర్జున్ ప్లాన్ చేస్తాడు. ఇకపోతే, బ్రహ్మ చనిపోయినా హత్యలు మాత్రం ఆగవు. అతని లానే ఇంకో సైకో కిల్లర్ అమ్మాయిల్ని చంపడం స్టార్ట్ చేస్తాడు.
మరి అతడు ఎవరు..? ఆండ్రూ భార్యా కూతురి తో పాటు ప్రియను అర్జున్ ఎలా సేవ్ చేస్తాడు..? బాబు (వినోద్ కిషన్) ని సైకో కిల్లర్‌గా అర్జున్ ఎందుకు అనుమానించాడు…? బ్రహ్మ తో బాబుకు ఉన్న సంబంధం ఏమిటి…? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…