వినోదం

Extra Ordinary Man OTT : ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ఓటీటీలో సంద‌డికి సిద్ధం.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ అంటే..!

Extra Ordinary Man OTT : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కొందరు హీరోలు మాత్రమే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో యూత్ స్టార్ నితిన్ ఒకడు కాగా, ఇటీవ‌లి కాలంలో ఆయ‌న‌కి మంచి విజ‌యాలు ద‌క్క‌లేదు. ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం పెద్ద దెబ్బ కొట్టింది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీకి మొద‌టి రోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుండి ఆదరణ పెద్దగా లభించడం లేదు. ఫలితంగా ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో రాలేదు. ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఈ క్రేజీ మూవీకి వసూళ్లు మరీ తక్కువగానే వచ్చాయి. ఫలితంగా ఇది డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుండ‌గా, సంక్రాంతి వీక్ నుంచే నితిన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

Extra Ordinary Man OTT

చిత్రంలో లో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో న‌టించి మెప్పించాడు. అయితే కామెడీ వ‌ర్క‌వుట్ అయినా క‌థలో బ‌లం లేక‌పోవ‌డంతో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అల‌రించ‌లేక‌పోయింది. ఇందులో క‌థానాయిక‌గా శ్రీలీల న‌టించ‌గా, సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించాడు. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాకు హ‌రీస్ జైరాజ్ సంగీతాన్ని అందించాడు. నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ విష‌యంపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM