Bollywood Celebrities : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. ఈ పేరు గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరూ చేయలేని ఫీట్‌ను ఎవరైనా ఒక వ్యక్తి చేస్తే దాన్ని రికార్డుగా చెబుతూ గిన్నిస్ బుక్ వారు రికార్డును ఆ వ్యక్తికి అందజేస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రంగాల్లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించారు. మన దేశంలోనూ ఈ రికార్డులను సాధించిన వారు చాలా మందే ఉన్నారు. అయితే బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ రికార్డ్స్‌ను సాధించారు. ఇక వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ సూపర్ స్టార్‌గా పిలవబడే అమితాబ్ బచ్చన్‌కు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆయన ఎంతో యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. అయితే ఈయన పేరున ఒక గిన్నిస్ రికార్డు ఉంది. అదేమిటంటే.. ఈయన 19 మంది సింగర్స్‌తో కలిసి హనుమాన్ చాలీసా పఠించారు. ఇందుకు గాను ఆయనకు గిన్నిస్ రికార్డు లభించింది. ఇక బాలీవుడ్ నటుడు, కింగ్ ఖాన్‌గా పిలవబడే షారూక్ కూడా గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. 2013లో రూ.223 కోట్లు సంపాదించి అత్యధిక పారితోషికం అందుకున్న ఇండియన్ నటుడిగా ఈయన రికార్డును నెలకొల్పాడు.
నటి సోనాక్షి సిన్హా పేరిట కూడా ఒక గిన్నిస్ రికార్డు ఉంది. ఈమె అత్యధిక మంది ఒకేసారి గోర్ల పెయింట్ వేసుకున్న ఈవెంట్‌లో పాల్గొని తన పేరును కూడా రికార్డుల్లో వచ్చేలా చేసుకుంది. ఇక అభిషేక్ బచ్చన్ పేరిట కూడా ఒక గిన్నిస్ రికార్డు ఉంది. ఈయన తన ఢిల్లీ 6 మూవీకి గాను 12 గంటల్లో అత్యధిక చోట్ల ప్రమోషన్ చేశారు. ఇందుకు గాను ఈయన తన ప్రైవేట్ జెట్ ద్వారా ఏకంగా 1800 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అలాగే అత్యధిక పాటలు పాడిన సింగర్‌గా ఆషా భోంస్లే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. 2011 అక్టోబర్ వరకు ఈమె పలు భారతీయ భాషల్లో మొత్తం కలిపి ఏకంగా 11వేలకు పైగా పాటలను పాడారు.
1998లో ఒకే రోజు ఏకంగా 28 పాటలు పాడిన బాలీవుడ్ సింగర్‌గా కుమార్ సాను అప్పట్లో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక కుటుంబం నుంచి అత్యధిక నటులు వచ్చిన వంశంగా కపూర్ కుటుంబానికి బాలీవుడ్ లో గిన్నిస్ రికార్డు ఉంది. దీన్ని కపూర్ వంశం మొదటి యాక్టర్ పృథ్వీ రాజ్ కపూర్ సాధించారు. 2013 సంవత్సరానికి గాను బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా కత్రినా కైఫ్ రికార్డు సృష్టించింది. అప్పట్లో ఈమె రూ.63.75 కోట్లను ఏడాదిలో అందుకోవడం విశేషం. 2023లో తన మూవీ సెల్ఫీ కోసం ఫ్యాన్స్‌తో అత్యధిక సెల్ఫీలు తీసుకున్న నటుడిగా అక్షయ్ కుమార్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇలా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు గిన్నిస్ రికార్డులను సాధించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…