Disney Plus Hotstar OTT Movies : ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు. తమిళం, హిందీ,మలయాళ భాషలలో డిఫరెంట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్స్‌లో ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా చిన్నా మూవీ.. హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ తమిళ మూవీ చిత్తా. సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. హాట్ స్టార్‌లో నవంబర్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఇక కన్నూరు స్క్వాడ్ అనే చిత్రం మమ్ముట్టి హీరోగా రూపొందగా, ఈ చిత్రాన్ని క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిచారు. మలయాళంలో మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నవంబర్ 17 నుంచి తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక తారా సుతారియా, అభిషేక్ బెనర్జీ , రాజ్‌పాల్ యాదవ్, ధైర్య కర్వా ప్రధాన పాత్రలుగా రూపొందిన అపూర్వ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమాకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. కిడ్నాప్ అయిన ఓ యువతి ఎలా తప్పించుకుందో చూపించే కథతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇక వాటితో పాటు డ్యాషింగ్ త్రు ది స్నో- నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్, లేబుల్- నవంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే ది సాంటా క్లాజెస్- నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలానే విజిలాంటే- నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, వాలట్టీ: టేల్ ఆఫ్ టేయిల్స్- నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నాయి.