వినోదం

Chandramukhi 2 TV Premiere : చంద్ర‌ముఖి 2 థియేట‌ర్స్‌లో మిస్ అయ్యారా.. అయితే మీకు ఒక గుడ్ న్యూస్..

Chandramukhi 2 TV Premiere : ర‌జ‌నీకాంత్ హీరోగా రూపొందిన చంద్ర‌ముఖి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించగా… పి వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో నటించగా … నాజర్ , వడివేలు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ కొరియోగ్రాఫర్‌ రాఘ‌వా లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ పోషించింది. పీ వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.

చంద్ర‌ముఖి 2 సినిమాకు భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వ‌ర‌ల్డ్ టెలివిజన్ ప్రీమియ‌ర్‌కి సిద్ధ‌మైంది. చంద్రముఖి 2 తెలుగు వెర్షన్‌ 2023 డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్ కానుండగా.. తమిళ వెర్షన్‌ 2024 జనవరి 1న సాయంత్రం 06:30 గంటలకు సందడి చేయనుంది. ఇంకేంటి ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు టీవీలో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Chandramukhi 2 TV Premiere

సుబాస్కరన్ సమర్పణలో చంద్ర‌ముఖి2 చిత్రాన్ని లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. చంద్రముఖి 2లో లక్ష్మీమీనన్‌, మహిమ నంబియార్‌, రాధికాశరత్‌కుమార్‌, రావు రమేశ్‌, రవిమారియా, విఘ్నేశ్‌, సృష్టి డాంగే, సుభిక్ష, ఐజీ మహేంద్రన్‌, సాయి అయ్యప్పన్‌, సురేశ్ మీనన్‌, శత్రు టీఎం కార్తీక్‌ కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్ట‌డంతో కేవలం సుమారు రూ.40కోట్ల కలెక్షన్‍లను మాత్రమే రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి థియేట‌ర్స్,ఓటీటీలో అంత‌గా అల‌రించ‌లేక‌పోయిన
ఈ చిత్రం టీవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM