గురువారం, జూన్ 11, 2026
వినోదం

Bhimla Nayak : పవన్‌ అభిమానులకు చేదువార్త.. సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్‌ అవుట్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

Bhimla Nayak : వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి కొన్నాళ్లుగా అంద‌రిలోనూ స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. సంక్రాంతికి రాద‌ని ప‌లుమార్లు…

Bhimla Nayak : పవన్‌ అభిమానులకు చేదువార్త.. సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్‌ అవుట్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

Bhimla Nayak : వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి కొన్నాళ్లుగా అంద‌రిలోనూ స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. సంక్రాంతికి రాద‌ని ప‌లుమార్లు ప్ర‌చారం జ‌ర‌గ‌గా, వాటిని ఖండిస్తూ వ‌చ్చింది చిత్ర యూనిట్‌. కానీ చివ‌ర‌కు మూవీని జ‌న‌వ‌రి 12 నుండి త‌ప్పించి ఫిబ్ర‌వ‌రికి పోస్ట్ పోన్ చేశారు. ఫిబ్రవరి 25కి మార్చినట్లు తాజాగా వెల్లడించారు.

Bhimla Nayak is out from sankranthi releases here is the new date

వాస్త‌వానికి సంక్రాంతి బరిలో పవన్‌ ఉంటారని అందరూ భావించారు. కానీ ఆయన అభిమానులకు షాక్‌ ఇస్తూ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి పాన్‌ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నేతృత్వంలో జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌లించ‌డంతో భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డింది.

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన భీమ్లా నాయ‌క్ చిత్రంకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి