Animal OTT : టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌తో కలిసి చేసిన చిత్రం యానిమల్. ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. యానిమల్ రన్‌టైం 3 గంటల 21 నిమిషాలు అని తెలిసిందే. అయితే థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు.
థియేటర్ వెర్షన్ కోసం తగ్గించిన చేసిన 8-9 నిమిషాల కట్స్ సీన్లను కూడా నెట్‍ఫ్లిక్స్ వెర్షన్‍లో యాడ్ చేయనున్నట్టు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో భారీ కలెక్షన్లతో సత్తాచాటిన యానిమల్‍కు ఓటీటీలోనూ మంచి స్పందన దక్కించుకుంటుందని అందరు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.840 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం అందుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…