Anchor Sreemukhi : ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న అందాల యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. చూడ చక్కని అందంతో పాటు క్యూట్ మాటలతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది. తెలుగులో టాప్ ఫైవ్ ఫిమేల్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తోంది.ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది.ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ టీవీ, ఓటీటీ షోలతో బిజీగా ఉంది. సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం తిరుగులేని స్టార్‌గా కొనసాగుతోంది.
బిజీ షెడ్యూల్‌లో, శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రసార ఛానెల్ ద్వారా అభిమానులతో సరదాగా గడిపింది. తన ప్రేమకథతో పాటు పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రేమలో ఎప్పుడైనా విఫలమయ్యారా అని ఓ అభిమాని శ్రీముఖిని అడిగాడు. దానికి స్పందించిన శ్రీముఖి.. తన లవ్ బ్రేకప్ విశేషాలను అభిమానులతో పంచుకుంది. ప్రేమలో చాలాసార్లు విఫలమయ్యానని చెప్పింది. పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ ఆపేస్తావా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. పెళ్లయినా యాంకరింగ్ ఆపనని స్పష్టం చేసింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది. హార్ట్ బ్రేక్ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయనే విషయాన్ని, ఇన్నాళ్లు దాచిన రహస్యాన్ని ఆమె బయటపెట్టింది.
మూడు పదులు దాటి నాలుగు పదుల వైపు దూసుకెళ్తుంది శ్రీముఖి. ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అడపాదడపా ఆమెకి టీవీ షోస్‌లో అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా, తెలివిగా తప్పించుకుంటుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం శ్రీముఖి నాలుగైదు షోస్‌కి యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. అందులో `స్టార్ మా పరివార్`, `మిస్టర్ అండ్ మిసెస్`, `సారంగ ధరియా`, అలాగే `కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్` షోలకు యాంకరింగ్ చేస్తూ రాణిస్తుంది. అదే సమయంలో ప్రతి వారం తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుందీ యాంకర్.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…