గురువారం, జూన్ 11, 2026
వినోదం

Allu Arjun : వామ్మో.. బన్నీ మేక‌ప్ కోసమే రోజుకి 8 గంట‌ల టైమ్‌ ప‌ట్టేదా ?

Allu Arjun : క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌ల కాబోతున్న మ‌రో బ‌డా చిత్రం పుష్ప‌. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్…

Allu Arjun : వామ్మో.. బన్నీ మేక‌ప్ కోసమే రోజుకి 8 గంట‌ల టైమ్‌ ప‌ట్టేదా ?

Allu Arjun : క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌ల కాబోతున్న మ‌రో బ‌డా చిత్రం పుష్ప‌. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో దీనికి బ‌న్నీ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. గ‌త చిత్రాలకు పూర్తి భిన్నంగా అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపిస్తాడు. పుష్పరాజ్ గా ఆయన నటన అద్భుతం. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తాయని నిర్మాత‌లు చెప్పారు.

Allu Arjun took 8 hours daily for pushpa movie make up

”పుష్పరాజ్ పాత్రకు సంబంధించి అల్లు అర్జున్ మేకప్ కోసమే ప్రతిరోజూ 2 గంటలు సమయం పట్టేది. దీని కోసం ఆయన పొద్దున్నే నిద్ర లేచేవాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ మేకప్ తీసేయడానికి మరో ఒకటిన్నర – రెండు గంటలు పడుతుంది. ఇలా మేకప్ కు మాత్రమే కొన్నిసార్లు 7-8 గంటలు సమయం కేటాయించేవారు. మిగతా టైంలో షూటింగ్ చేసేవారు. బన్నీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తారు. ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్” అని చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నామ‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాతోపాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచే విధంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠ భరితంగా సినిమా సాగుతుందని, ఆ విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి