గురువారం, జూన్ 11, 2026
వినోదం

Allu Arjun: సినిమా అంతా భుజం పైకెత్తి నటించా.. చాలా స‌మ‌స్య అయింద‌న్న బ‌న్నీ

Allu Arjun : తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా ఒకటి. ఈ నెల 17 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ సరసన…

Allu Arjun: సినిమా అంతా భుజం పైకెత్తి నటించా.. చాలా స‌మ‌స్య అయింద‌న్న బ‌న్నీ

Allu Arjun : తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా ఒకటి. ఈ నెల 17 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Allu Arjun said he lifted shoulder and acted in pushpa movie

ఈ సినిమా షూటింగ్ కోసం మారుమూల ప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చిందని, కొత్త లొకేషన్స్ ఈ సినిమాలో చాలా చూపించామని అల్లు అర్జున్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ లు కూడా వెయ్యాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి రోజూ 500 మందికి పైగా సెట్ లో పనిచేసేవారని, ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాలతో సమానమని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతం గా నటించారని చెప్పారు.

ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒక భుజం కిందకి వంచి, మరొక భుజం పైకెత్తి కనిపిస్తున్నారు. ఇలా నటించడం వల్ల అల్లు అర్జున్ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. భుజం పైకెత్తి నటించడం వలన షూటింగ్ చివరికి వచ్చే సరికి భుజం పట్టేసి, మెడ చిన్నగా ఐపోయేదని బన్నీ చెప్పారు. అందుకోసం ప్రతి రోజు నిద్ర లేవగానే ఒక 15 నిమిషాలు మెడని స్ట్రెచ్ చేసేవారని వెల్లడించారు బన్నీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి