Akka OTT : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమాలో వైవిధ్యమైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆమె చేసిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అయ్యాయి. గ్లామరస్ పాత్రలోనే కాకుండా డీగ్లామరస్ పాత్రల్లో కూడా అలరించి మెప్పించగల సత్తా ఉన్న ఈమె… వరుసగా చిత్రాలు చేస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం చాలా మంది ముద్దుగుమ్మలు ఓటీటీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా తొలిసారి ఓ వెబ్‌సిరీస్ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ది రైల్వే మేన్, మండలా మర్డర్స్ వంటి వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన ఈ వైఆర్ఎఫ్ నిర్మాణ సంస్థనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ముఖాముఖిగా ఇందులో తలపడబోతున్నారని, ఇదో రివెంజ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు అన్నీ పూర్తి అయ్యాయని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ విషయాలను బయటకు రానివ్వకూడదని మేకర్స్ భావించినట్టు సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తూ… వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…