Renu Desai : రేణూ దేశాయ్.. ఆమె ఒక నటిగా, మల్టీ టాలెంట్ ఉన్న మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రేణ దేశాయ్ సినిమాలకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఎప్పటికి దగ్గరగానే ఉంటుంది. అయితే రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఇందులో హేమలత లవణం అనే పాత్రలో నటించి మెప్పించింది. సినిమా అంత హిట్ కాకపోయిన ఆమె పర్‌ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే డిసెంబర్ 4న రేణూ దేశాయ్ బర్త్ డే కాగా, ఆమెకి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు అకీరా నందన్. అకీరా తన తల్లి మాదిరిగానే మల్టీ టాలెంటెడ్. ఆటల్లో మేటి.. చదువుల్లో ఫష్ట్.. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లోనూ ముందుంటాడు. పియానో వాయిస్తాడు.. బాస్కెట్ బాల్ ఆడేస్తుంటాడు. ఇప్పుడు విదేశాల్లో సినిమా, మ్యూజిక్ అంటూ కోర్సులు నేర్చుకుంటాడు.
ఇప్పుడు అకిరా నందన్ ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తల్లి బర్త్ డే సందర్భంగా ఓ వీడియోని ఎడిట్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. జానీ సినిమాలోని సీన్లను, షాట్స్‌ను ఎడిట్ చేయగా, అందులో రేణూ దేశాయ్ కనిపించే షాట్లను ఎక్కువ పెట్టి.. పవన్ కళ్యాణ్‌తో కనిపించే షాట్లను రెండు మూడు యాడ్ చేశాడు. ఇక ఈ ఎడిట్‌కు సప్త సాగరాలు దాటి మూవీలోని సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో పెట్టేశాడు. తనయుడు ఇచ్చిన గిఫ్ట్‌ని రేణూ దేశాయ్ చాలా లేట్‌గా షేర్ చేసింది. తాజాగా నా కొడుకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఇది అంటూ రేణూ మురిసిపోతూ ఓ వీడియో షేర్ చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అమ్మ కోసం అకిరా చేసిన ఈ వీడియో మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అమ్మానాన్నలు అంటే అకిరాకు ఎంత ప్రేమో ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతోంది. ఈ వీడియో చాలా బాగా ఎడిట్ చేశావంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సాధారణంగా అకీరా అప్పుడప్పుడు తన తల్లికి ఏదో రకంగా సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటాడు.. ఆ మధ్య రేణూ దేశాయ్‌కి ఇష్టమైన పాటను పియానో ద్వారా వినిపించాడు. అది విని రేణూ చాలా మురిసిపోయింది. అయితే పవన్ నుండి విడిపోయాక మరో పెళ్లి చేసుకోని రేణూ దేశాయ్ పిల్లలే తన ప్రాణంగా జీవిస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…