గురువారం, జూన్ 11, 2026
వినోదం

Akhanda Movie : అభిమానుల అల్ల‌ర్ల‌కు ఆస్ట్రేలియాలో అఖండ షో ర‌ద్దు..!

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే మాస్ ప్రేక్ష‌కుల‌లో ఎంత జోష్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. సింహా, లెజెండ్‌ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ –…

Akhanda Movie : అభిమానుల అల్ల‌ర్ల‌కు ఆస్ట్రేలియాలో అఖండ షో ర‌ద్దు..!

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే మాస్ ప్రేక్ష‌కుల‌లో ఎంత జోష్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. సింహా, లెజెండ్‌ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెర‌కెక్కిన‌ ఈ మూవీ హ్యాట్రిక్‌ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (డిసెంబర్‌2) న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.

Akhanda Movie show cancelled in austrlia because of balakrishna fans

మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోనూ అఖండ హంగామా జోరుగా ఉంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే థ‌మన్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య అభిమానులు అఖండ సినిమా చూస్తూ తెగ ర‌చ్చ చేస్తున్నార‌ట‌. థియేటర్లో చేసిన రచ్చకు పోలీసులు షాక్ ఇచ్చారట. అయితే అది ఇండియాలో కాదు ఆస్ట్రేలియాలో.

ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏ మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. పోలీసులు షో ఆపేసి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.

బాల‌య్య సినిమాకు ఆ మాత్రం హంగామా చేయ‌రా.. అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, విదేశాల్లో సైతం అభిమానుల‌కు అఖండ‌ ఫీవర్ పట్టుకుంది. బాలయ్య అభిమానులను ఉద్దేశించి సినీ మార్క్ థియేటర్‌లో అలర్ట్ పెట్టారు. థియేటర్ సౌండ్‌ని నిర్దిష్ట డెసిబుల్స్‌కు పరిమితం చేసిందని, ఏది ఏమైనప్పటికీ సౌండ్ పెరగదని నోటీసు అంటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి