పదోతరగతి ఉత్తీర్ణతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

August 30, 2021 10:55 PM

పదో తరగతి పాసైన నిరుద్యోగులకు సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే SECL ఖాళీగా ఉన్నటువంటి 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పదోతరగతి ఉత్తీర్ణతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఆన్‌లైన్‌లో  దరఖాస్తు చేసుకోవాలి.

ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ గురించి ఏవైనా సందేహాలు, మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు. https://secl-cil.in

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment