ఏపీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రారంభమైన ధరఖాస్తు ప్రక్రియ!

July 31, 2021 9:05 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ 49 ఖాళీలలో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 17 పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు.

Jobs Employment Career Occupation Application Concept

ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలను చేయడం కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తులను చేసుకోవచ్చు.అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://dme.ap.nic.in/

ఈ నోటిఫికేషన్లు ఆయా ఖాళీలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థుల వయస్సు జూలై 27 నాటికి 40 రెండు సంవత్సరాలకు మించి ఉండకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము 1500 రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయల రాయితీ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment