Lord Ganesha : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు. చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట. దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలే ఉన్నాయి. తులసి ఆకులను పలు ఔషధాల తయారీలోనూ వాడుతారు. అయితే మీకు తెలుసా..? తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మొక్కగా ఎందుకు మారిందో..? ఎందుకు ఆ మొక్కకు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయో..? అదే తెలుసుకుందాం రండి.
పురాతన కాలం నుంచి తులసి మొక్కకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే, విఘ్నేశ్వరుడు ఒకసారి గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి గణేషున్ని చూసి ముగ్దురాలవుతుంది. వెంటనే గణేషుని వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకుంటే తన తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు. దీంతో తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా, ఇష్టం లేకుండా జరుగుతుందని తులసి అంటుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్నీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వినాయకుడు తులసికి శాపం పెడతాడు.
అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకుని శాప విమోచనం చేయమని గణేషున్ని ప్రార్థిస్తుంది. కాగా గణేషుడు అప్పుడు ఏమంటాడంటే, శాపం విమోచనం చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయని వినాయకుడు తులసికి వరం ఇస్తాడు. అనంతరం తులసి శంకచూద అనే ఓ రాక్షసున్ని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది.
మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. అప్పటి నుంచి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు. అంతేకాదు తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…