ఆధ్యాత్మికం

Ants : చీమలకి ఆహారం పెడితే.. ఇంత పుణ్యం వస్తుందా..?

Ants : అన్నదానం అన్నింటికంటే చాలా మంచిదని అంటారు. అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం పెడితే, ఎంతో పుణ్యం కలుగుతుందని అంటారు. అలానే చీమలకి కూడా ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పెద్దలు చెప్పడం, మీరు వినే ఉంటారు. చీమలకి ఆహారం పెడితే నిజంగా చాలా మంచి కలుగుతుందట. బియ్యం పిండిలో చక్కెర లేదంటే బెల్లం కలిపి చీమలకి పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది. లేదంటే చీమలకి వట్టి చక్కెరనైనా కూడా పెట్టొచ్చు.

ఇలా కనుక చీమలకి ఆహారం పెడితే 10,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుందట. అయితే, ఇళ్లల్లో మనుషులు తిరిగే చోట కాకుండా చీమలు ఉండే చోట వీటిని పెడితే చక్కటి ఫలితం కలుగుతుంది. తేనెని తమలపాకులో లేదంటే రావి ఆకులో పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడ వదిలేయాలి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది.

Ants

తేనెను చీమలకి పెడితే దోషాలు పోతాయి. అయితే, ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మనం చేసిన దానం వల్లే. ఈరోజు బాగున్న వాళ్ళు ఒకప్పుడు గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు. దానం చేస్తే దరిద్రం నుండి బయటపడొచ్చు. అయితే ఏమీ లేని ఒక వ్యక్తి దానం ఏమీ చేయడానికి లేదని బాధపడుతూ ఉంటే, అప్పుడు తోటకూర ఉంది కదా దానం చేయి అని మిత్రుడు చెప్తాడు. అది విని అతను తోటకూర దానం చేస్తాడు. ఆ దానంతో సిరిసంపదలు కలుగుతాయి. తర్వాత జీవితం అంతా కూడా హాయిగా ఉంటాడు.

ఇంకో జన్మలో అతను ఒక దేశానికి రాజుగా పుడతాడు. పూర్వ జన్మ జ్ఞానం కూడా ఉంటుంది. తాను చేసిన దానం వల్లే సిరి సంపదలు వచ్చాయని తెలుస్తుంది. అప్పుడు, రాజ్యం అంతా తోటకూరని పండించి, దానం చేయాలని అనుకుంటాడు. అయితే ఆ రాజు దగ్గరికి సన్యాసి వచ్చి పూర్వజన్మలో నీకు ఏమీ లేదు తోటకూర ఇచ్చావ్ కాబట్టి నీకు ఫలితం ఉంది. ఈ జన్మలో నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు తోటకూర దానం చేస్తే, ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్తాడు. అయితే శక్తి లేని వాళ్ళు వున్నది ఏమి ఇచ్చినా కొంచెం ఫలితం వస్తుంది. అన్నీ ఉన్నవాళ్లు వారి శక్తి కొద్దీ దానం చేస్తే మంచిది. అయితే, చీమలకి చక్కెర వేస్తే పదివేల మందికి దానం చేసిన పుణ్యం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM