Touching Elders Feet : మన తల్లిదండ్రులు లేదంటే పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుండి కూడా ఈ ఆచారం ఉంది. దీనిని మనం పాటిస్తున్నాం. ఇంటికి వచ్చిన బంధువులకి, అమ్మమ్మ, తాతయ్యలకి, తల్లిదండ్రులకి నమస్కారం పెడుతూ ఉంటాం. పుట్టినరోజు లేదంటే ఏదైనా వేడుకలు వంటివి జరిగినా కూడా పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటాం. అయితే ఎందుకు పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి..? దానివల్ల ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వేదాల నుండి కూడా ఈ సాంప్రదాయం ఉంది. వేదాల్లో ఈ పద్ధతిని చరణ స్పర్శ అని పిలిచేవారు. పూర్వకాలంలో తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని, ఉపాధ్యాయులని పలకరించడానికి ముందు పాదాలకు నమస్కారం చేసుకోవాలని పిల్లలకు నేర్పించే వాళ్ళు. ఒకప్పుడు అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే పెద్దల పాదాలకి నమస్కారం చేసేవారు. రాత్రి నిద్ర పోయే ముందు తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసేవాళ్లు.
ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లే ముందు కూడా పెద్ద వాళ్ల పాదాలకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత వెళ్లేవారట. ఇలా ఆశీర్వాదం తీసుకుని వెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రం అలా కాదు. ఈ ఆచారం రాను రాను మారిపోయింది. పెద్ద వాళ్ళ పాదాలకి నమస్కరించడం ముఖ్యమైన సంప్రదాయమని మహాభారతం అధర్వణ వేదంలో వివరించడం జరిగింది.
అయితే ఇలా నమస్కారం చేయడం వలన శక్తివంతంగా ఉంటుందట. అలాగే గొప్ప అనుభూతి ఉంటుందట. మానవ శరీరంలో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి. పెద్ద వాళ్ళ పాదాలని తాకడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పెద్దవాళ్ళు తలపై చేయి పెట్టి ఎప్పుడు ఆశీర్వదిస్తారో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. ఇలా నమస్కారం చేయడం అనేది వ్యాయామంగా కూడా ఉంటుంది. శరీరాన్ని వంచడం వలన వెన్నెముక వంగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకనే అలా నమస్కారం చేస్తుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…