ఆధ్యాత్మికం

Tirumala : వెంక‌టేశ్వ‌ర స్వామికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Tirumala : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మ‌తాల‌కు చెందిన ఆల‌యాలు, ప్రార్థ‌నా మందిరాల్లోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో పుణ్య క్షేత్రం తిరుమ‌ల. మొద‌టి స్థానంలో వాటిక‌న్ సిటీ ఉంది. అయితే తిరుమ‌ల‌కు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్ట‌త‌ను గూర్చి అంద‌రికీ తెలుసు. అక్క‌డ ఏడుకొండ‌ల్లో కొలువై ఉన్న శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామిని ప్రార్థిస్తే అన్ని స‌మ‌స్య‌లు పోయి, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతామ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. ఇక బ్ర‌హ్మోత్స‌వాలు వ‌చ్చిన‌ప్పుడైతే ఈ సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఈ క్ర‌మంలో స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు కొన్ని కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంది.

అయితే వెంక‌టేశ్వర స్వామికి అంత‌టి ఆదాయం వ‌స్తుండ‌డాన్ని ప‌క్క‌న పెడితే ఆయ‌న‌ను భ‌క్తులు రెండు పేర్ల‌తో పిలుచుకుంటారు. అది ఒక‌టి ఆప‌ద‌మొక్కుల వాడ‌ని, ఇంకోటి వ‌డ్డీ కాసుల వాడ‌ని. కోరిన కోర్కెలు తీర్చి, ఆప‌ద‌ల నుంచి గ‌ట్టెక్కించి, అంతా శుభ‌మే క‌లిగించే వాడు కావ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఆప‌ద మొక్కుల వాడ‌ని పేరు వ‌చ్చింది. అయితే వడ్డీ కాసుల వాడ‌నే పేరు రావ‌డం వెనుక గ‌ల కార‌ణం ఏమిటో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

Tirumala

ఒకానొక స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌ద్మావ‌తీ దేవిని పెళ్లి చేసుకోవ‌డానికి భూలోకం వ‌చ్చాడ‌ట‌. అయితే ల‌క్ష్మీ దేవిని వైకుంఠంలోనే వ‌దిలి రావ‌డంతో ఆయన ద‌గ్గ‌ర డ‌బ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డ‌బ్బు పుట్ట‌లేదు. ఈ క్ర‌మంలో కుబేరుడు వెంక‌టేశ్వ‌ర స్వామికి పెళ్లిక‌య్యే ధ‌నం మొత్తం ఇచ్చాడ‌ట‌. ఒక సంవ‌త్స‌రంలోగా ఆ అప్పు తీరుస్తాన‌ని వెంక‌టేశ్వ‌ర స్వామి చెప్పాడ‌ట‌. అయితే తీరా సంవ‌త్స‌రం దాటే సరికి వెంక‌టేశ్వ‌ర స్వామి ఆ ధ‌నం అప్పు తీర్చ‌కుండా వ‌డ్డీ క‌డ‌తాడ‌ట‌. అప్ప‌టి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వ‌డ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్త‌మే అవుతూ వ‌స్తుంద‌ట‌. అయినా స్వామి మాత్రం వ‌డ్డీనే క‌డుతూ వ‌స్తున్నాడ‌ట‌. అందుకే ఆయ‌న‌కు వ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు వచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM