Akshaya Tritiya : ప్రతి ఏటా వచ్చే అక్షయ తృతీయ పండుగ గురించి మనకు తెలుసు కదా. ఆ రోజున ఎవరైనా కనీసం కొంతైనా బంగారం కొంటే దాంతో వారికి సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. అందుకనే నేటి తరుణంలో చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇక వారికి అనుగుణంగా బంగారం వ్యాపారులు కూడా వారికిష్టమైన బంగారు నగలను వివిధ రకాల డిజైన్లతో అందుబాటులో ఉంచుతూ పలు ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఆ రోజున బంగారం కొనకూడదట. వాస్తవానికి ఆ రోజు పలు వస్తువులను దానం చేయాలట. దీంతో ఎక్కువ పుణ్యం లభిస్తుందట. మరి ఆ దానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుందట. వారికి మరో జన్మ ఉండదట. నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారట. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడట. దీంతోపాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుందట. అక్షయ తృతీయ రోజున నీటిని నువ్వులతో కలిపి దానం ఇస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పద్మ పురాణంలో ఉంది. నేర పూరిత స్వభావంతో కాకుండా అనుకోకుండా, తెలియకుండా చేసిన తప్పులకు మాత్రమే ఇలా పరిహారం అవుతుందట. కనుక అలాంటి తప్పులు చేసిన వారు అక్షయ తృతీయ నాడు అలా దానం ఇచ్చి చూస్తే ఫలితం కనిపిస్తుంది.
అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్న వారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి, అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానాల వలన మీ జాతకంలో ఉన్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు. సకల శుభాలు కలిగేలా అనుగ్రహిస్తాడు. అక్షయ తృతీయ రోజున వాహన దానం చేస్తే రాజసూయ యాగం వలన కలిగే ఫలితం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది. మురికివాడల్లో నివసించే పేదలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు సైకిళ్లను దానం చేయవచ్చు.
అక్షయ తృతీయ రోజున ఇతరులకు జ్ఞానం (చదువు)ను దానం ఇస్తే దాంతో ఏడేడు జన్మల పుణ్య ఫలితం లభించి మోక్షం పొందుతారట. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని అందుకే అన్నారు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…