ఆధ్యాత్మికం

Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది.

దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే మీరు వెలిగించిన చోట దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు. దేవతలు అందరూ కూడా వస్తారు. ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. ఉదయం స్నానం చేశాక దీపాన్ని వెలిగించవచ్చు. సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి. మాంసాహారం తినే వారు కూడా ప్రతి రోజూ దీపారాధన చేయడానికి తలస్నానం చేయక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు.

Deepam

దీపం పెట్టే ప్రమిద‌ బంగారంతో చేసింది కానీ వెండి, ఇత్తడి లేదంటే మట్టిదైనా కూడా ఫ‌రవాలేదు. దీపపు ప్రమిద‌ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం పెట్టే ప్రమిద‌ స్టీలు, ఇనుపది అయ్యి ఉండకూడదు. దీపం పెట్టడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడవాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొంచెం పసుపు, కుంకుమ చల్లి ఆ తర్వాత దీపం వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వ‌త్తితో చేయకూడదు. అది అశుభ సూచికం. కనీసం రెండు వ‌త్తులైనా సరే వెలిగించాలి. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది.

లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. ఏ ఇంట అయితే రెండు పూట‌లా దీపం వెలుగుతుందో, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దుష్టశక్తులన్నీ పోయి ఆ ఇంట అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. దీపారాధన చేసే వారికి గ్రహ దోషాలు, పీడలు వంటివి ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM