ఆధ్యాత్మికం

Lakshmi Devi : విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?

Lakshmi Devi : అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు స‌ముద్ర మ‌థ‌నం చేస్తారు తెలుసు క‌దా. ఆదిశేషువును తాడుగా చేసుకుని మంద‌ర ప‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. దీంతో దాని నుంచి అనేక వ‌స్తువులు ఉద్భ‌విస్తాయి. అందులో నుంచి వ‌చ్చే విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకుంటాడు. అనంత‌రం కామ‌ధేనువు, ఐరావ‌తం, ఉచ్ఛైశ్ర‌వం, క‌ల్ప‌వృక్షం, అప్సర‌స‌లు, చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తారు. చివ‌రిగా ల‌క్ష్మీదేవి కూడా వ‌స్తుంది. అయితే అంద‌రూ అన్నీ తీసుకుంటారు. కానీ ల‌క్ష్మీ దేవిని మాత్రం ఎవ‌రూ తీసుకోరు. తీసుకోరు అంటే.. ఆవిడే ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లదు. కేవ‌లం విష్ణువు వ‌ద్ద‌కే వెళ్లి ఆయ‌న్ను మాత్ర‌మే వ‌రిస్తుంది. అయితే ల‌క్ష్మీదేవి అలా ఎందుకు చేస్తుందో తెలుసా..?

క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ల‌క్ష్మీదేవి ఉద్భ‌వించిన‌ప్పుడు మొద‌ట ఆమె రుషుల‌ను చూస్తుంది. అయితే వారు ఆమెను త‌మ వ‌ద్ద‌కు ర‌మ్మంటే త‌మ వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని ఆహ్వానిస్తారు. అయినా ఆమె వారిని వ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే రుషులు ఎల్ల‌ప్పుడూ ఆగ్రహంతో ఉంటార‌ని, వారికి వారిపై గ‌ర్వం ఎక్కువ‌ని, వారు మాన‌వుల క‌న్నా అధికుల‌మ‌నే పొగ‌రుతో ఉంటార‌ని, దైవం వ‌ద్ద‌కు ఎలాగైనా చేరుకోగ‌ల‌మనే అహం క‌లిగి ఉంటార‌ని భావించి ల‌క్ష్మీదేవి వారిని వ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది. అనంత‌రం ఆమె రాక్ష‌సుల‌ను చూస్తుంది. కానీ వారి వ‌ద్ద‌కు కూడా వెళ్ల‌దు. ఎందుకంటే రాక్ష‌సులు ఉండే ప్రాంతాలు అత్యంత అప‌రిశుభ్రంగా ఉంటాయ‌ని ఆమె న‌మ్మ‌కం.

Lakshmi Devi

కేవ‌లం స్వచ్ఛ‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలోనే ఉండాల‌ని ఆమె అనుకుంటుంది. అందుకే రాక్ష‌సుల‌ను కూడా కాద‌ని ల‌క్ష్మీదేవి ముందుకు వెళ్తుంది. అనంత‌రం ఆమె ఇత‌ర దేవుళ్ల‌ను కూడా దాటి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వారు క‌ష్ట ప‌డే త‌త్వం ఉన్న వారు కాద‌ని, వారి శ‌క్తుల‌న్నీ వారికై వారు సంపాదించిన‌వి కావ‌ని ఆమె న‌మ్మ‌కం. అలా ల‌క్ష్మీదేవి దేవుళ్ల‌ను కూడా దాటి వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఉలుకూ ప‌లుకూ లేకుండా శేష త‌ల్పంపై ప‌డుకున్న విష్ణువు క‌నిపిస్తాడు.

అంద‌రూ త‌నను త‌మ వ‌ద్ద‌కే రావాల‌ని ఆహ్వానిస్తుంటే ఆయ‌న మాత్రం అలా త‌న‌ను ప‌ట్టించుకోకుండా ఉండ‌డం చూసి ల‌క్ష్మీదేవి ఆశ్చ‌ర్య‌పోతుంది. వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేస్తుంది, చేసుకుంటే విష్ణువునే వివాహం చేసుకోవాల‌ని అనుకుంటుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా విష్ణువుకు పాదాభి వంద‌నం చేసి త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆయ‌న్ను అడుగుతుంది. అందుకు విష్ణువు అంగీక‌రిస్తాడు. అలా ల‌క్ష్మీదేవి విష్ణువుకు భార్య అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM