ఆధ్యాత్మికం

Goddess Lakshmi Devi : మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించి ఇటువంటి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి.. ఎందుకో తెలుసా..?

Goddess Lakshmi Devi : హిందువుల్లో చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధ‌నానికి ఆమే అధిప‌తి. ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది జ‌రుగుతుంది. క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను పూజిస్తే ధ‌నం రాద‌ట‌. పైగా ఉన్న ధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే పోతుంద‌ట‌. ఈ క్ర‌మంలో భక్తులు ఎలాంటి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ల‌గూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్న‌ట్టుగా ఉండే బొమ్మ‌ను పూజించ‌కూడ‌ద‌ట‌. దీంతో అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. ధ‌నం వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు పోతుంద‌ట‌. తామ‌ర పూవుపై ల‌క్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్న‌ట్టుగా ఉన్న ఫొటోను పూజించాల‌ట‌. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట. ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ట‌. గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధ‌నం ల‌భిస్తుంద‌ట‌. అంతా మంచే జరుగుతుంద‌ట‌.

Goddess Lakshmi Devi

శేష‌త‌ల్పంపై విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మ‌ను పూజిస్తే అలాంటి వారి దాంప‌త్య జీవితం సుఖ‌మయంగా సాగుతుంద‌ట‌. కుబేరుని విగ్ర‌హం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో ల‌క్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వ‌ర్యాల‌ను క‌లిగిస్తుంద‌ట‌. పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. ధ‌నం కూడా బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. దీపావళి రోజున స్ఫ‌టిక శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభ‌మే జ‌రుగుతుంది.

ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవుల‌ను ఎక్కువగా వాడి పూజ చేయాల‌ట‌. దీంతో అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ట‌. దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి. దీని వ‌ల్ల భక్తులకు అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌. ఓం య‌క్షాయ కుబేరాయ వైశ్ర‌వ‌ణాయ ధ‌న‌ధాన్యాధిప‌త‌యే, ధ‌న‌ధాన్య‌స‌మృద్ధిం మే దేహి దాప‌య స్వాహా.. అనే మంత్రాన్ని ప‌ఠించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM