Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి నాడు ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

January 15, 2026 9:13 PM

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి పండుగ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తి ఏటా దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తుంటారు. వాడ వాడ‌లా గ‌ణ‌నాథులు కొలువు దీరి 9 రోజుల పాటు భక్తుల‌చే విశేష రీతిలో పూజ‌లందుకుంటారు. త‌రువాత అంగ‌రంగ వైభ‌వంగా నిమ‌జ్జ‌నం నిర్వ‌హిస్తారు. ఇలా ప్ర‌తి ఏడాది ప్ర‌జ‌లు వినాయ‌క చ‌వ‌తి వేడుక‌లను జ‌రుపుకుంటుంటారు. ఇక ఈసారి సెప్టెంబ‌ర్ 7వ తేదీన వినాయ‌క చ‌వితి వ‌చ్చింది. ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల మ‌ధ్య మంచి ముహుర్తం ఉంద‌ని పండితులు చెబుతున్నారు.

అయితే వినాయ‌కుడికి 21 ర‌కాల ప‌త్రాల‌తో పూజ‌లు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌ణేషుడు భోజ‌న ప్రియుడు క‌నుక ఆయ‌న‌కు అనేక ర‌కాల పిండి వంట‌ల‌ను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే గ‌ణేషుడికి పెట్టే పిండి వంట‌ల విష‌యానికి వ‌స్తే వాటిల్లో ఉండ్రాళ్లు మొద‌టి స్థానంలో ఉంటాయి. త‌రువాత ఆయ‌న‌కు మోద‌కాల‌ను కూడా నైవేద్యంగా పెడుతుంటారు. ఈ రెండు పిండి వంట‌లు అంటే వినాయ‌కుడికి చాలా ఇష్టం. క‌నుక భ‌క్తులు వినాయ‌క చ‌వితి నాడు గ‌ణేషుడికి ఈ రెండు పిండి వంట‌ల‌ను నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఏవైనా తీర‌ని కోరికలు ఉంటే మ‌న‌సులో బ‌లంగా కోరుకోండి. దీంతో మీరు కోరిన కోరిక‌ల‌ను ఆ బొజ్జ గ‌ణ‌ప‌య్య నెర‌వేరుస్తాడు.

do like this on Vinayaka Chavithi to get a boon from lord ganesha
Vinayaka Chavithi

ఇక వినాయ‌క చ‌వితి నాడు చాలా మంది 21 రకాల ప‌త్రాల‌ను సేక‌రించి మ‌రీ ఆయ‌న‌కు పూజ‌లు చేస్తుంటారు. ఇది టెక్ యుగం క‌నుక మ‌న‌కు ఏది కావాల‌న్నా కూడా ల‌భిస్తోంది. అయితే గ‌ణేషుడి పూజకు గాను మీకు 21 ర‌కాల ప‌త్రి ల‌భించ‌క‌పోతే మీరు చింతించాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆయ‌న‌కు గ‌రిక అంటే మ‌హా ఇష్టం. క‌నుక గ‌రిక‌తో ఆయ‌న‌ను పూజిస్తే చాలు. ఇత‌ర ప‌త్రి లేద‌ని బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇలా వినాయ‌కుడికి ఉండ్రాళ్లు, మోద‌కాలు చేసి పెట్ట‌డంతోపాటు ఆయ‌న‌కు రెండు గ‌రిక పోచ‌ల‌ను స‌మ‌ర్పించి భ‌క్తితో వేడుకుంటే మ‌న కోరిక‌ల‌ను ఆయ‌న నెర‌వేరుస్తాడు. క‌నుక ఆయ‌న‌ను ఇలా పూజించ‌డం మరిచిపోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now