Bheeshma : నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు.. అంటే.. ఈ కలియుగానికి ముందు.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరాశక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, కౌరవులకు చెప్పాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరు అయినా, చెడ్డ పేరు అయినా వస్తుంది. కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. తద్వారా సమాజం బాగుంటుంది. ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి. అన్నీ నష్టాలే కలుగుతాయి.
సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి. లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి. మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు. గర్భంతో ఉన్న స్త్రీలు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి. వారికి ఇబ్బందులు కలిగించకూడదు. స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణమే ఉదాహరణ.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…