Anantha Padmanabha Swamy : కొన్ని దశాబ్దాల ముందు ఏం జరిగేదంటే, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రసాదం కోసం, ఎంతోమంది వచ్చే వారట. ఒక పేద వైష్ణవుడు, రోజు ముందే నిలబడే వాడట. తనకోసం, తన ఆరుగురు కొడుకుల కోసం ప్రసాదం పెట్టమని, ఆయన అడిగేవారట. రోజు కూడా ఆలయ అధికారులకి, ఆ వ్యక్తికి మధ్య వాదులాట జరుగుతూ ఉండేది. ప్రసాదం నీకే ఇచ్చేస్తే, ఇతరులకు ఏం పెడతామని, ఆలయ అధికారులు ఆయనని మందలించేవారట.
ప్రసాదం పెట్టకపోతే, నా కొడుకులు నాకు దక్కరు అని ఆ పెద్దాయన చెప్పేవారట. ఒకరోజు రామానుజుల వారు అక్కడ గొడవ చూసి అడగగా, ఆలయ అధికారులు ఆ పెద్దతను ఇలా చేస్తున్నాడని అతనికి చెప్పారు. ఆ వైష్ణవుడిని చూసి రామానుజులు ఆలయంలో కొన్ని కైంకర్యములు చేసి, ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని అడిగారు. నా కొడుకులకి సేవ చేయడంతో, నా సమయం అయిపోతోంది. ఇక నేను ఆలయంలో ఏం చేస్తాను అని చెప్పాడు ఆ వైష్ణవుడు.
పైగా, నేను వేదాలనేమీ చదువుకోలేదు. ఆలయసేవ కూడా నేను చేయలేను. నాకు కేవలం విష్ణు సహస్రనామం లోని శ్లోకాలు తప్ప ఇంకేమీ రావు అని చెప్పారట. సరే అయితే నువ్వు అవే చదువు అని రామానుజుల వారు చెప్పగా అతను.. విశ్వం విశ్వ వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు..అని మొదలు పెట్టాడు. నాకు అంతే వచ్చు అని చెప్తే అప్పుడు రామానుజులు అదే నువ్ జపించు. నీకు ఆలయానికి రావాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. అప్పటినుండి మళ్ళీ ఆలయానికి రాలేదు.
రోజూ రంగనాధులకి సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా మాయమైపోతోంది. ఎవరు దొంగిలిస్తున్నారో తెలీక భద్రతను పెంచేశారు. ప్రసాదం ఈ వైష్ణవుడే తీశాడేమో అని మనుషుల్ని పంపగా.. ఆయన ఎక్కడా దొరకలేదు. ఒకరోజు రామానుజుల వారు ఆ వైష్ణవుడిని చూశారు. ఆ వైష్ణవుడు ఆయన కాళ్ల మీద పడి, మీ కటాక్షం కారణంగానే ఆ పిల్లవాడు ప్రసాదం అందజేస్తున్నాడని చెప్పారు. భూత బృతే నమః’ జపాన్ని రోజు చేస్తున్నాను అని చెప్పాడు. ఎవరా పిల్లవాడు అని అడగగా.. రామానుజ దాసుడనని చెప్పాడని చెప్పారు. ఇంతకీ ఆ బాలుడు ఎవరో కాదు సాక్షాత్ శ్రీ రంగనాథుడే.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…