వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చక్కగా పెళ్లయి ఇద్దరు పిల్లలతో సుఖంగా సాగిపోవాల్సిన ఆమె జీవితం.. వేరొక వ్యక్తిపై మోజుతో కన్న పిల్లలను కాదనుకుని అతని చెంతకు చేరింది. ప్రియుడితో ఎనిమిది సంవత్సరాల పాటు సహజీవనం చేసిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అతనిని నిలదీయడంతో చివరికి అతను ఆమెపై హత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ బొరిగిపేట గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బొరిగిపేట గ్రామానికి చెందిన సంపతిరావు దేవరాజ్ అనే వ్యక్తి గంగాధరపేటకు చెందిన కమలలు పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. అయితే కమలకు మరొక వ్యక్తితో పెళ్లి చేయడంతో పెళ్లి అయినప్పటికీ ప్రియుడిపై ఉన్న మోజుతో నిత్యం తనని కలుస్తూ అతనితో ఎంతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలోనే కమలకు ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత తన ప్రియుడిపై మోజుతో తన పిల్లలను వదిలి టెక్కలికి వచ్చింది. అయితే అప్పటికే తన ప్రియుడికి పెళ్లయి ఇద్దరు సంతానం ఉన్నారు.
ఈ విషయాన్ని తన భార్యకు తెలియకుండా కమలను ఒక అద్దె ఇంట్లో పెట్టి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలని ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన దేవరాజ్ దగ్గర కమల ప్రస్తావించడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే దేవరాజ్ ఎలాగైనా ఆమెను వదిలించుకుంటే తనకు ప్రశాంతత దొరుకుతుందని భావించి ఆమెకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని బొరిగి పేట గ్రామ శివారుకు తీసుకెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె సొమ్మసిల్లి పడిపోతే చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కమల స్పృహలోకి రాగానే స్థానికుల సహాయంతో టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…