క్రైమ్‌

క‌త్తి మహేష్ మృతిపై పోలీసుల విచార‌ణ‌.. ప్ర‌మాద స‌మ‌యంలో అస‌లు ఏం జ‌రిగిందో చెప్పేసిన డ్రైవ‌ర్‌..

న‌టుడు, సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌కు గురై చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం విదిత‌మే. అయితే క‌త్తి మ‌హేష్ మృతిపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు బుధ‌వారం ప‌లువురిని ప్ర‌శ్నించారు.

క‌త్తి మ‌హేష్ కారు డ్రైవ‌ర్ సురేష్‌ను పోలీసులు నెల్లూరుకు పిలిపించి విచార‌ణ చేప‌ట్టారు. కోవూరు పోలీస్ స్టేష‌న్‌లో సురేష్‌ను పోలీసులు విచారించారు. ఈ క్ర‌మంలో సురేష్ అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగింది, ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింది ? అన్న వివ‌రాల‌ను పోలీసుల‌కు వెల్ల‌డించాడు.

నిద్ర స‌మ‌యం కావ‌డంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాల‌నుకున్నాం. ఆలోపే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌మాద స‌మ‌యంలో క‌త్తి మ‌హేష్ నిద్ర‌పోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న ముందుకు ప‌డిపోయారు. నేను సీటు బెల్ట్ పెట్టుకున్నా. అందువ‌ల్లే నాకేమీ కాలేదు. ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డా. కంటెయిన‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.. అని సురేష్ తెలిపాడు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ప‌గిలిన అద్దాల ముక్క‌లు మ‌హేష్ కంటికి గుచ్చుకున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల స‌హాయంతో మ‌హేష్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేర్చా. విచార‌ణకు స‌హ‌క‌రిస్తా. ఈ కేసులో న‌న్ను అనుమానించాల్సిన ప‌నిలేదు.. అని సురేష్ అన్నాడు. కాగా పోలీసులు ఈ కేసులో మ‌రికొంత మందిని విచారించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM