తన నటనతో యువ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వృద్ధాప్య వయస్సులోనూ ఆయన మన్మథుడిలా కనిపిస్తుంటారు. ఆయన ఈ వయస్సులోనూ అంత యవ్వనంగా కనిపించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని అభిమానులు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా లీకైన నాగార్జున ఫొటో ఒకదాన్ని చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
నాగార్జున వయస్సు 61 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు కనిపించినా 30 ఏళ్ల మన్మథుడిలా దర్శనమిచ్చేవారు. కానీ తాజాగా నాగార్జున వృద్ధుడి లుక్‌లో కనిపించే సరికి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. నాగార్జున ఇలా మారిపోయారేంటి ? అని షాకవుతున్నారు.
తెల్లని జుట్టు, తెల్లని మీసాలు, ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లని వలయాలతో నాగార్జున లేటెస్ట్ పిక్ లీకైంది. సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ అవుతోంది. ఇది నాగార్జున ఒరిజినల్ గెటప్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముసలి మన్మథుడు, తాతయ్య అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆయన పక్కన ఉన్నది ఎవరు అనే విషయం నిర్దారణ కాలేదు.
ఇక నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తుండగా, కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో బంగార్రాజు అనే మూవీలో నటిస్తున్నారు. త్వరలో స్టార్ మా లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్‌గా ఆయన వ్యవహరించనున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…