ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు బుకింగ్స్ షురూ.. ఈ విధంగా స్కూట‌ర్లను బుక్ చేయండి.. ఇంటికే డెలివ‌రీ అవుతాయి..!

September 15, 2021 11:21 AM

ఓలా ఎల‌క్ట్రిక్ సంస్థ గ‌త నెల‌లో ఓలా ఎల‌క్ట్రిక్ ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఈ స్కూటర్ల‌కు గాను ఆ సంస్థ బుధ‌వారం నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. క‌నుక క‌స్ట‌మ‌ర్లు వీటిని ప్ర‌స్తుత కొనుగోలు చేయ‌వ‌చ్చు. గ‌తంలో ప్రి-బుకింగ్ చేసుకున్న‌వారు ఈ స్కూట‌ర్ల‌ను ఇప్పుడు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ రెండు స్కూట‌ర్లు భిన్న ర‌కాల క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తున్నాయి.

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు బుకింగ్స్ షురూ.. ఈ విధంగా స్కూట‌ర్లను బుక్ చేయండి.. ఇంటికీ డెలివ‌రీ అవుతాయి..!

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను బుక్ చేసేందుకు కింద సూచించిన స్టెప్స్‌ను అనుస‌రించాలి.

స్టెప్ 1 : ఓలా ఎల‌క్ట్రిక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో మీ మొబైల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్‌చేయాలి. త‌రువాత ఓటీపీ వ‌స్తుంది. దాన్ని వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2 : ఓలా ఎల‌క్ట్రిక్ ఎస్‌1, ఎస్1 ప్రొల‌లో ఏదైనా ఒక మోడ‌ల్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3 : ఈ రెండు స్కూట‌ర్ల‌కు గాను 10 క‌లర్ ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దేన్న‌యినా ఎంచుకోవాలి.

స్టెప్ 4 : మీరు ఎంచుకున్న ఎల‌క్ట్రిక్ బైక్‌కు గాను పేమెంట్ చేయాలి. అయితే వీటికి లోన్ స‌దుపాయం కూడా అందిస్తున్నారు. ఓలా ఎస్‌1కు రూ.2,999, ఎస్1 ప్రొ కు రూ.3199 ఈఎంఐతో లోన్ పొంద‌వ‌చ్చు.

స్టెప్ 5 : లోన్ ద్వారా వీటిని కొనుగోలు చేయాల‌ని భావిస్తే ఎస్1కు రూ.20వేలు, ఎస్1 ప్రొ స్కూట‌ర్‌కు రూ.25వేల అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్ 6 : కొనుగోలు పూర్త‌య్యాక క‌స్ట‌మ‌ర్ల‌కు డెలివ‌రీ డేట్‌ను అందిస్తారు. ఆ తేదీ రోజు స్కూట‌ర్‌ను ఇంటికే డెలివ‌రీ చేస్తారు.

ఈ విధంగా చాలా సుల‌భంగా ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు బుకింగ్స్ షురూ.. ఈ విధంగా స్కూట‌ర్లను బుక్ చేయండి.. ఇంటికే డెలివ‌రీ అవుతాయి..!”

Leave a Comment