దారుణం.. పుట్టింటికి వెళ్తాన‌ని అడిగినందుకు భార్య ముక్కు కోసిన భర్త‌..

September 10, 2021 10:32 PM

రాజ‌స్థాన్‌లోని జోధ్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వ‌స్తాన‌ని అడిగినందుకు ఆగ్ర‌హించిన భ‌ర్త త‌న భార్యను దారుణంగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. ఆమె ముక్కు కోసేశాడు. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. వివ‌రాల్లోకి వెళితే..

దారుణం.. పుట్టింటికి వెళ్తాన‌ని అడిగినందుకు భార్య ముక్కు కోసిన భర్త‌..

రాజ‌స్థాన్‌లోని జోధ్ పూర్ ప‌రిధిలో ఉన్న లునావ‌స్ అనే గ్రామంలో భూమా రామ్‌, దేవి (25) అనే దంప‌తులు నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి దేవి త‌న పుట్టింటికి వెళ్లి వ‌స్తాన‌ని త‌న భ‌ర్త‌ను అడుగుతూ వ‌స్తోంది. అందుకు అత‌ను కూడా మొద‌ట అంగీకారం తెలిపాడు. కానీ తాజాగా ఏమైందో తెలియ‌దు కానీ.. త‌న భార్య పుట్టింటికి వెళ్లి వ‌స్తాన‌ని అడిగితే వ‌ద్ద‌న్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది.

ఇద్ద‌రి మ‌ధ్య ముందుగా మాట‌ల యుద్ధం జ‌రిగింది. అయితే చివ‌ర‌కు ఆవేశం ప‌ట్ట‌లేని భూమా రామ్ తీవ్ర ఆగ్ర‌హంతో క‌త్తి తీసుకుని త‌న భార్య ముక్కు కోశాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన ఇరుగు పొరుగు వారు దేవిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. దేవి సోద‌రుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని భూమా రామ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment