ఆలుగ‌డ్డ‌లంటే మీకు ఇష్ట‌మా ? రుచి చూసి చెబితే నెల‌కు రూ.50వేలు సంపాదించుకోవ‌చ్చు..!

September 8, 2021 3:41 PM

ఆలుగ‌డ్డ‌ల‌తో భిన్న రకాల వంట‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. చిప్స్‌, పులుసు, ఫ్రై.. ఇలా భిన్న ర‌కాలుగా ఆలుగ‌డ్డ‌ల‌ను వండి తింటారు. అయితే ఎలా చేసినా అవి ఇచ్చే టేస్ట్ మామూలుగా ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి ఆలుగ‌డ్డ‌లు అంటే భ‌లే ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారికి యూకేలోని ఆ రెస్టారెంట్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

ఆలుగ‌డ్డ‌లంటే మీకు ఇష్ట‌మా ? రుచి చూసి చెబితే నెల‌కు రూ.50వేలు సంపాదించుకోవ‌చ్చు..!

యూకేలోని ది బొటానిస్ట్ అనే రెస్టారెంట్ నిర్వాహ‌కులు వినూత్న‌మైన ఆఫ‌ర్ ను అందిస్తున్నారు. వారానికి ఒక‌సారి.. అంటే నెల‌కు నాలుగు సార్లు వారి రెస్టారెంట్‌కు చెందిన ఆలు వెరైటీల‌ను టేస్ట్ చేసి రివ్యూల‌ను రాయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల‌లో ఆ రివ్యూల‌ను పోస్ట్ చేయాలి. ఒక్కో రివ్యూ 500 ప‌దాల‌కు మించ‌రాదు. అలాగే వీడియోల ద్వారా కూడా రివ్యూలు చేయ‌వ‌చ్చు. వాటిని టిక్‌టాక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలి. ఈ విధంగా చేస్తే నెల‌కు 500 పౌండ్లు.. అంటే దాదాపుగా రూ.50వేలు ఇస్తారు.

https://www.instagram.com/p/CTb_3K9jlgi/?utm_source=ig_embed&ig_rid=0d34b7ff-843e-43b9-8134-7b6049df6182&ig_mid=AAC33700-BE3C-4153-8B0D-7D6E5C04BC97

నెల‌కు ఈ విధంగా కేవ‌లం నాలుగు సార్లు.. వారాంతాల్లో ప‌నిచేసి ఏకంగా రూ.50వేలు సంపాదించ‌వ‌చ్చు. ఇక ఉద్యోగానికి గాను సెప్టెంబ‌ర్ 19న ప్ర‌త్యేక సెష‌న్‌ను నిర్వ‌హిస్తున్నారు. అందులో ఎంపికైన వారికి ఈ ఉద్యోగం ఇస్తారు. అందువ‌ల్ల ఆలుగ‌డ్డ‌లు అంటే ఇష్టం ఉన్న‌వారు.. వాటికి చెందిన వంట‌కాల‌ను రుచి చూసి రివ్యూల‌ను రాస్తాం అనుకుంటే ఈ జాబ్‌కు అప్లై చేయ‌వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now