స్ట‌న్నింగ్ యార్క‌ర్‌తో జానీ బెయిర్‌స్టోను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. వైర‌ల్ వీడియో..!

September 7, 2021 1:22 PM

లండన్‌లోని ది ఓవ‌ల్ మైదానంలో భార‌త్ ఇంగ్లండ్‌పై చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే. ఓవ‌ల్‌లో 50 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే భార‌త్ ఇంగ్లండ్‌పై గెలిచింది. 157 ప‌రుగుల‌ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో నాలుగో టెస్టులో భార‌త్ విజ‌యం సాధించ‌గా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వ‌చ్చింది.

స్ట‌న్నింగ్ యార్క‌ర్‌తో జానీ బెయిర్‌స్టోను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. వైర‌ల్ వీడియో..!

అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌, బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించారు. అందువ‌ల్ల భార‌త్ విజ‌యం సునాయాస‌మైంది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భార‌త ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా ప‌లు కీల‌క వికెట్లు తీశాడు. లంచ్ అనంత‌రం వేసిన స్పెల్‌లో ముందుగా ఓల్లి పోప్‌ను వెన‌క్కి పంపాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల‌ను తీసిన ఇండియ‌న్‌ ఫాస్ట్ బౌల‌ర్‌గా బుమ్రా రికార్డు సాధించాడు.

త‌రువాత మరో నాలుగు బంతులు వేసిన బుమ్రా ఇంకో కీల‌క వికెట్ తీశాడు. జానీ బెయిర్ స్టోను క్లీన్ బౌల్డ్ చేశాడు. అద్భుత‌మైన యార్క‌ర్‌తో బెయిర్‌స్టోను బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు. బుమ్రా వేసిన బంతికి బెయిర్‌స్టో వ‌ద్ద స‌మాధానం లేదు. ఈ క్ర‌మంలో బెయిర్‌స్టోకు ఈ ఏడాదిలో ఇది వ‌రుస‌గా 4వ డ‌క్ అయింది. కాగా బెయిర్‌స్టోను ఔట్ చేసేందుకు బుమ్రా వేసిన యార్క‌ర్ తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బుమ్రాపై అంద‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment